Sreesanth marries princess bhuveneshwari kumari

Sreesanth marriage, Bhuveneshwari Kumari,Sreesanth,Sreesanth wedding,Bhuveneshwari Kumari wedding,cricketer Sreesanth, bcci, Jaipur princess

Sreesanth ties the knot with Jaipur princess Bhuvaneshwari Kumari.

భువనేశ్వరి మెడలో శ్రీ మూడు ముళ్ళు

Posted: 12/12/2013 03:50 PM IST
Sreesanth marries princess bhuveneshwari kumari

భారత జట్టు ఆటగాడు, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ గత కొంత కాలం క్రితం ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఇరుక్కొని బీసీసీఐ విధించిన నిషేదాన్ని ఎదుర్కొంటూ ఆటకు దూరంగా ఉన్న ఆయన ఓ ఇంటి వాడయ్యాడు. శ్రీశాంత్ వివాహం గురువాయర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో రెండు కుటుంబ సాంప్రదాయాల మధ్య జరిగింది.

ఈయన తన ప్రేయసిరాలు అయిన భవనేశ్వరి మెడలో వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు వేశాడు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన జ్యువెలరీ డిజైనర్ అయిన ఈమెతో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఇరువురు కుటుంబాల పెద్దలను ఒప్పించి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుకను జరుపుకున్నాడు. కేరళ హిందు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుక నిన్న రాత్రి కొచ్చిలోని ఓ ప్రయివేట్ హోటల్లో రిసెప్షన్ రాజస్థానీ సంప్రదాయంలో జరిగింది.

శ్రీ స్పాట్ ఫిక్సింగ్ సమయంలో జైలులో ఉన్నప్పుడు భువనేశ్వరీ వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పి అండగా నిలిచింది. ఇక ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ ఆడకుండా బీసీసీఐ శ్రీశాంత్పై సెప్టెంబర్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను బెయిల్పై ఉన్నాడు. ఈ కేసు డిసెంబర్ 18 విచారణకు రానుంది. పెళ్లి తరువాత శ్రీకి అనుకూలంగా తీర్పు కలిసివస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles