త్వరలో ఐపీఎల్ 2014 సీజన్ వేలం బెంగుళూరులో మొదలు కాబోతుంది. ఈ వేలంలో ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడుపోతాడో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వేలంలో ఉన్న ఆటగాళ్ళ జాబితాలో ప్రముఖ ఆటగాళ్ళు అయిన వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, దినేష్ కార్తీక్, మురళీ విజయ్ లాంటి వారి పేర్లే కాకుండా మిగతా భారత ఆటగాళ్ళ కనీస రేట్లను నిర్ణయించి లీగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీల చేతికి అందించింది.
ఇందులో ఒకప్పుడు స్టార్ బ్యాట్స్ మెన్స్ గా వెలుగొందిన సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి వారి రేటు మరీ తక్కువగా 2 కోట్లు మాత్రమే నిర్ణయించింది. గత కొంత కాలంగా వీరిద్దరు సరైన ఫాంలో లేక భారత జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ జట్టులో ఆడిన సెహ్వాగ్ ను ఆ జట్టు ప్రక్కన పెట్టగా, పుణె వారియర్స్ జట్టును ఐపీఎల్ నుండి తప్పించడంతో యువరాజ్ వేలంలోకి వచ్చాడు. ఈ జాబితాలో 48 మంది భారత జట్టుకు ఆడిన, ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు.
మొత్తం 11 మంది భారత క్రికెటర్లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు. ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్, జహీర్, పుజారా తమ కనీసధరను రూ.1.5 కోట్లుగా పేర్కొన్నారు. ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. ఐపీఎల్ కౌన్సిల్ నిర్ణయించిన కనీస ధరకైనా సెహ్వాగ్ , యువరాజ్ ను ఫ్రాంఛైజీలు తీసుకుంటాయో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more