Dhoni a defensive captain says amarnath

Virat Kohli, Mohinder Amarnath, Mansoor Ali Khan Pataudi, Mahendra Singh Dhoni,Duncan Fletcher

Mohinder Amarnath says time has come to remove MS Dhoni from captaincy as his defensive approach has resulted in India prolonged failure on foreign soil.

ధోనిని పీకెయ్యడానికి సరైన సమయం ఇదే

Posted: 02/20/2014 11:51 AM IST
Dhoni a defensive captain says amarnath

టీం ఇండియాకు మినీ ప్రపంచకప్ ను, ప్రపంచకప్ ను అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఎన్నో సిరీస్ లు, కప్ లు అందించి మిస్టర్ కూల్ కెప్టెన్ గా ప్రశంసలు అందుకున్న ధోని ఒకప్పుడు మెచ్చుకున్న వారే ఇప్పుడు విమర్శలు చేయడమే కాకుండా, తనను కెప్టెన్సీ నుండి పీకెయ్యాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సుదీర్ఘ కాలం నుండి వన్డే, టెస్టు జట్టుకు కెప్టెన్ గా ఉంటున్న ధోని విదేశాల్లో టీం ఇండియా జట్టును నడిపించడంలో విఫలం అవ్వడమే కాకుండా, గత కెప్టెన్ల మాదిరి గానే చెత్త ట్రాక్ రికార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, నెంబర్ వన్ ర్యాంకు పోవడంలో ఈయన్ను పక్కన పెట్టాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది.

మాజీ టెస్టు క్రికెటర్ మొహిందర్ అమర్ నాథ్ ఏకంగా ధోనిని కెప్టెన్సీ నుండి పీకెయ్యడానికి ఇదే సరైన తరుణమని, విదేశాల్లో జట్టును నడిపించడంలో గత కెప్టెన్లలాగే ఈయన కూడా విఫలం అయ్యాడని, ధోని ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డాడని, విదేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ జట్టును గెలిపించే కెప్టెన్ అయిన మున్సూర్ ఆలీ పటౌడీ లాంటి వారు కావాలని, ఇలాంటి ధోని కాదని అన్నారు.

వన్డేల్లో ధోని మ్యాచ్ విన్నర్ అయినా, ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్లు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని సూచించాడు. అమర్ నాథ్ మాటను ఖాతరు చేసి కొత్త కెప్టెన్ ని వెతికే పనిలో పడతారో, వచ్చే ప్రపంచకప్ వరకు ధోనినే కొనసాగిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles