ఒక్క ఐడియా జీవితాన్ని మార్చుస్తుందే మాట ఐడియా నెట్ వర్క్ వాళ్ళు పెట్టుకుంది. అదే ఒక్క క్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుందని బెంగుళూరు రాయల్ చాలంజర్స్ కు కోల్ కత్తా జట్టు ప్రాక్టికల్ చేసి చూపించింది. అవును రాత్రి కోల్ కత్తా నైట్ రైడర్స్ , బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో కోల్ కత్తా అనూహ్య విజయం సాధించి ఐపీఎల్ లో తన ఖాతా తెరిచింది. విజయం మాదే అని ధీమాతో ఉన్న బెంగుళూరు జట్టుకు క్రిస్ లెన్ గట్టి షాక్ ఇచ్చాడు. డివిలియర్స్ కొట్టిన భారీ షాట్ ని కళ్ళు చెదిరే రీతిలో పట్టుకొని జట్టుకు విజయాన్ని అందించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కొల్ కత్తా బ్యాట్స్ మెన్స్ లో జాక్వెస్ కల్లీస్ (43), క్రిస్ లిన్ (45) రాణించారు. కోల్ కత్తా బ్యాట్స్ మెన్స్ ను బెంగుళూరు బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వరుణ్ అరోన్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
స్టార్ బ్యాట్స్ మెన్స్ ఉన్న బెంగుళూరు జట్టుకు 150 పరుగుల లక్ష్యం చిన్నదే అయినా చివర్లో తడబాటుకు గురయ్యి లక్ష్యాన్ని ఛేదించలేక పోయింది. బెంగుళూరు ఓపెనర్లు టకాపలె (40), కోహ్లీ (31) రాణించినా, మిడిల్ ఆర్డర్ లో యువరాజ్ సింగ్ మందకొడి ఇన్నింగ్స్ ఆడటం, నరైన్, వినయ్ ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో బెంగుళూరు విజయం ముంగిట బోల్తా పడింది. ఈ విజయంతో నైట్ రైడర్స్ అనూహ్య విజయం సాధించి ఈ సీజన్ లో ఖాతా తెరిచింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more