అన్నీ జట్ల మాదిరిగానే కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కూడా గ్లేన్ మాక్స్‌వెల్ భయం వెంటాడుతోంది. అతనికి డేవిడ్ మిల్లర్ కూడా జత కలవడంతో బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో శనివారం జరిగే మ్యాచ్‌కి నైట్ రైడర్స్ సమాయత్తమవుతోంది.
అయితే మాక్స్‌వెల్‌ను ఏ విధంగా కట్టడి చేయాలన్నది ఆ జట్టును వేధిస్తున్న ప్రశ్న. మాక్స్‌వెల్ మూడు మ్యాచ్‌ల్లో 95, 89, 95 చొప్పున పరుగులు సాధించాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌కు భారీ లక్ష్యాలు కూడా చిన్నవిగా మారిపోతున్నాయి. లక్ష్యాన్ని నిర్దేశించడంలో లేదా ఛేదించడంలో మాక్స్‌వెల్ విజృంభణకు బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
అదే స్థాయిలో రాణించడం పంజాబ్‌ను పటిష్టమైన స్థితిలో నిలబెట్టింది. వీరేందర్ సెవాగ్ విఫలమవుతున్నప్పటికీ, చటేశ్వర్ పుజారా, మాక్స్‌వెల్, పుజారా తదితరులతో జార్జి బెయిలీ నాయకత్వం వహిస్తున్న పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తున్నది.
అయితే, ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురినీ మినహిస్తే మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడి ప్రతి మ్యాచ్‌లోనూ గెలవడం అనుకున్నంత సులభం కాదు. మిగతా ఆటగాళ్లు కూడా తమ పాత్రలను సమర్థంగా పోషిస్తేనే విజయాలు సాధ్యమవుతాయి.
వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉద్దేశించిన ప్రపంచ వారోత్సవాలకు మద్దతుగా శనివారం నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లంతా చేతికి నీలం రంగు పట్టీలు కట్టుకొంటారు. ఇలాంటి ఒక సత్కార్యానికి తమ వంతు సాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని పంజాబ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more