Jacques kallis announces retirement

Jacques Kallis retirement, Jacques Kallis, Jacques Kallis announces retirement, South Africa Jacques Kallis, South African all-rounder.

Jacques Kallis announces retirement, South Africa Jacques Kallis announces retirement

నేను అందుకోసమే జట్టు నుండి తప్పుకుంటున్నా?

Posted: 05/22/2014 01:34 PM IST
Jacques kallis announces retirement

నేను అందుకోసమే జట్టు నుండి తప్పుకుంటున్నా క్రికెటర్ జాక్వస్ కలిస్ అంటున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఉన్నానంటూ ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించిన దిగ్గజ క్రికెటర్ జాక్వస్ కలిస్. కానీ కలిస్ గత మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే జట్టు ప్రయోజనాల కోసమే కలిస్‌ను ఆడించలేదని కోల్‌కతా యాజమాన్యం పేర్కొంది.

విజయవంతమైన జోడీ కోసం కలిస్ స్వయంగా జట్టు నుంచి తప్పుకొని మిగతా వారికి అవకాశం ఇచ్చినట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ సహాయక కోచ్ విజయ్ దహియా వెల్లడించాడు. కలిస్ చాంపియన్, లెజెండ్. అతణ్ని జట్టు నుంచి తప్పించడం చాలా కష్టం. కాని జట్టు గెలుపు కోసం మిగతావాళ్లకు అవకాశమిచ్చిన ఘనత అతనిది. చాలా సందర్భాల్లో కలిస్ ముందుకొచ్చి ఈ పిచ్‌కు అయితే సదరు ఆటగాడు సరిగ్గా సరిపోతాడని సూచించేవాడు అని దహియా అన్నాడు.

అయితే రానున్న ప్రపంచకప్‌లో సత్తాచాటేందుకు ఐపీఎల్‌ను ఓ చక్కని వేదికలాగా ఉపయోగించుకుంటున్నానని కలిస్ అంటున్నాడు. వన్డేలకు విరామం ప్రకటించి టెస్టుల్లో కొనసాగే మిగతా ఆటగాళ్లలా గాకుండా, కలిస్ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చి ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

గతేడాది భారత్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా కలిస్ తన అద్భుత కెరీర్‌కు ముగింపు పలికాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడం కోసం మరింత ఫిట్‌గా ఉండేందుకు ఐపీఎల్ నాకు మంచి ప్లాట్‌ఫామ్ లాగా ఉపయోగపడుతోంది అని కలిస్ అన్నాడు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles