Pietersen fined rs 12 lakh for slow over rate

Kevin Pietersen, Pietersen fined Rs 12 lakh, Delhi Daredevils captain , Delhi Daredevils captain Kevin Pietersen, IPL 7, Kevin Pietersen fined Rs 12 lakhs.

Pietersen fined Rs 12 lakh for slow over rate. Delhi Daredevils captain Kevin Pietersen

కుర్రోడికి 12 లక్షల దెబ్బ పడింది?

Posted: 05/22/2014 03:09 PM IST
Pietersen fined rs 12 lakh for slow over rate

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (కెపి)కి 12 లక్షల దెబ్బ పడింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో న్యూఢిల్లీలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడటమే ఇందుకు కారణం. ‘కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది.

ప్రస్తుత సీజన్‌లో ఈ జట్టు ఇటువంటి తప్పు చేయడం ఇదే తొలిసారి గనుక టోర్నమెంట్ నియమ నిబంధనలను అనుసరించి ఆ జట్టు సారథి కెవిన్ పీటర్సన్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించాం’ అని ఐపిఎల్ ఒక ప్రకటనలో వివరించింది.

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించిన విషయం విదితమే. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఇది వరుసగా ఏడో ఓటమి. బ్యాటింగ్ వైఫల్యమే తమ జట్టు ఓటమికి కారణమని పీటర్సన్ పేర్కొన్నాడు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles