Indian batsman ajinkya rahane has played wonderful in 2nd test match

Indian batsman Ajinkya rahane has played wonderful innings in lords ground opposite to the england team

భారత్ పరువును కాపాడిన రహానే!

Posted: 07/18/2014 12:42 PM IST
Indian batsman ajinkya rahane has played wonderful in 2nd test match

భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ మైదానంలో ప్రారంభమయిన సంగతి తెలిసిందే! అయితే ఇందులో భారత క్రికెటర్లు ఘోరంగా విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్లు... కేవలం 145 పరుగులకే 7 వికెట్లను కోల్పోయారు. దీంతో టీమిండియా అభిమానులు చాలా నిరాశపడ్డారు. భారత్ కు అత్యధిక స్కోరును కల్పించే ఆటగాడే లేడా అనే సమయంలో అజింక్యా రహానే అద్భుతంగా ప్రదర్శించి మరోసారి తన సత్తా ఏంటో చాటుకున్నాడు.

తక్కువ స్కోరు వద్ద వికెట్లు కోల్పోయిన భారత క్రికెట్ జట్టుకు అత్యధిక స్కోరును కల్పించడంలో అజింక్యా రహానే కీలకపాత్ర పోషించాడు. 145 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ తొలిరోజు ఆట చివరికి 290/9 స్కోరును చేయగలిగిందంటే దానికి కారణం కేవలం రహానే ప్రదర్శనే అని చెప్పుకోవాలి. ఇక మిగతా ఆటగాళ్లు అయిన ఓపెనర్ విజయ్ 24, పుజారా 28, కోహ్లీ 25 పరుగులు చేస్తే... భారత్ కెప్టెన్ ధోనీ కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. అలాగే జడేడా 3, ధావన్ 7, బిన్నీ 9 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాయి. అయితే చివర్లో భువనేశ్వర్ కుమార్ మాత్రం 36 పరుగులు చేసి, రహానేతో జోడి కలిపాడు. కానీ ఇతను కూడా బ్రాడ్ బౌలింగ్ చేతిలో కుప్పకూలిపోయాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కెప్లెన్ కుక్... సరియైన నిర్ణయమే తీసుకున్నాడని అతని తరఫు ఆటగాళ్లు మెచ్చుకున్నారు. ఇంగ్లాండ్ లో ప్రముఖ పేస్ బౌలర్ అయిన అండర్సన్ 55 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కైవసం చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లు కూడా తమదైన శైలిలో వికెట్లు తీసుకుంటూ లార్డ్స్ మైదానంలో చెలరేగిపోయారు. మొత్తానికి అజింక్యా రహానే వల్ల భారత్ కొంతమేరకు కోలుకుందని చెప్పుకోవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles