England cricket fans insulted ravindra jadeja

England cricket fans insulted ravindra jadeja in lords ground, india vs england cricket match, england bowler anderson, indian all rounder ravindra jadeja latest news, england cricket fans insulted ravindra jadeja, england fans in lords ground, talk fight between anderson and jadeja in test match, differences between anderson and jadeja, ravindra jadeja insulted by england cricket fans in lords ground

england cricket fans insulted ravindra jadeja

లార్డ్స్ మైదానంలో జడేజాకు ఘోర అవమానం

Posted: 07/18/2014 01:13 PM IST
England cricket fans insulted ravindra jadeja

ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్, టీమిండియా ఆల్ రౌండర్ జడేజా మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే! అయితే ఈ వివాదం చాలావరకు పెద్ద దుమారాన్నే రేపింది. ఇటు ఇండియా తరఫున ఐసీసీవారు అండర్సన్ మీద ఆరోపణలు మోపితే.. అటు ఇంగ్లాండ్ మేనేజ్ మెంట్ కూడా అందుకు సవాలు విసిరింది. ఒకవేళ అండర్సన్ చేసింది తప్పేనని నిజమయితే అతని మీద కొన్ని మ్యాచుల వరకు నిషేధం వేటు పడే అవకాశం వుంది.

ఇప్పుడు అదే వివాదానికి సంబంధించి జడేజాకు చేదు అనుభవం ఎదురయింది. లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు ప్రారంభమైన అనంతరం... తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసేందుకు వస్తున్న జడేజాను ఉద్దేశించి, అక్కడి ప్రేక్షకులు అవహేళన చేశారు. అందరూ ఇతని మీద వ్యంగంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గమనించిన రాహుల్ ద్రవిడ్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘‘ప్రేక్షకులు జడేజాను గేలి చేయడం తీవ్ర అసంతృప్తిని కలిగించిందని... తొలి టెస్ట్ లో వారిమధ్య చోటుచేసుకున్న వాగ్వివాదం గురించి ప్రేక్షకులు ఏం తెలుసు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

అలాగే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అయిన మైక్ అథర్టన్ కూడా జడేజాను ఉద్దేశించి ప్రేక్షకులు చేసిన వైఖరిని తప్పుపట్టాడు. గత ఏడాది యాషెస్ నుంచి వారి ప్రవర్తనల్లో చాలా మార్పులు వచ్చాయని అభిప్రాయపడ్డాడు. అసలు వివాదంలో ఏ ఆటగాడు తప్పు చేశాడోనన్న క్లారిటీ రాకముందే ప్రేక్షకులు జడేజా మీద దుందుడుకుగా ప్రవర్తించడం ఎంతో దురదృష్టకరమని, ఇలా చాలా బాధాకరమైన సంఘటన అని ఆయన తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles