Sachin tendulkar inducted into don bradman hall of fame

sachin tendulkar, sachin tendulkar latest news, don bradman news, sachin tendulkar don bradman fame, australian cricketer steve waugh

Sachin Tendulkar inducted into Don Bradman Hall of Fame

రిటైర్డ్ అయిన తర్వాత కూడా రికార్డుల మోతే!

Posted: 10/30/2014 01:30 PM IST
Sachin tendulkar inducted into don bradman hall of fame

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డులను తన ఖాతాలో జమచేసుకున్న క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. రిటైర్డ్ అయిన తర్వాత కూడా సరికొత్త సంచలనాలను సృష్టిస్తూనే వున్నాడు. ఇప్పటికే మన భారతీయ ప్రభుత్వంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సత్కారాలను పొందిన సచిన్ కు తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత బ్రాడ్ మన్ ఫౌండేషన్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సచిన్ కు చోటు దక్కింది. ఇతనితోపాటు ఆస్ట్రేలియా దిగ్గజం అయిన మాజీ కెప్టెన్ స్టీవ్ వాకు ఈ గౌరవం లభించింది. బుధవారంనాడు సిడ్నీలో జరిగిన ప్రత్యేక డిన్నర్ కార్యక్రమంలో బ్రాడ్ మన్ ఫౌండేషన్ ఈ ఇద్దరి దిగ్గజాల పేర్లను ఆనర్స్ బోర్డులో చేర్చింది. ఈ సందర్భంగా ఎస్‌సీజీ ఎలెవన్, బ్రాడ్‌మన్ ఎలెవన్ జట్టు సభ్యులు ఇద్దరు దిగ్గజాలకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం విశేషం.

ఈ నేపథ్యంలోనే సచిన్ టెండూల్కర్ తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. 1998లో బ్రాడ్ మన్ 90వ పుట్టినరోజు సందర్భంగా అడిలైడ్ లోని అతని నివాసంలో సచిన్ కలుసుకున్నాడు. అప్పుడు క్రికెటర్ వార్న్ కూడా తనతో వున్నాడని.. ఎవరుముందు దిగ్గజంతో మాట్లాడాలో తేల్చుకోలేకపోయామని అన్నాడు. ‘‘నువ్వు ఆస్ట్రేలియన్ కదా.. ముందు నువ్వే బ్రాడ్ మన్ తో మాట్లాడు’’ అని సచిన్ వార్న్ తో అన్నాడట. దానికి బదులుగా వార్న్ ‘‘నువ్వు బ్యాట్స్ మన్ వి కాబట్టి నువ్వే అతనితో నాకన్నా బాగా మాట్లాడగలవు’’ అని వార్న్ సచిన్ తో చెప్పినట్లుగా సచిన్ గుర్తు చేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sachin tendulkar  don bradman news  australian cricketer steve waugh  

Other Articles