Mudgal committee questions mahendra singh dhoni manager

mudgal committee, ipl spot fixing, mudgal committee news, ipl spot fixings news, ipl spot fixing players, mahendra singh dhoni, dhoni manager arun pandey, rithi sports news

mudgal committee questions mahendra singh dhoni manager arun pandey

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ‘‘ధోనీ’’ మేనేజర్!

Posted: 10/29/2014 03:33 PM IST
Mudgal committee questions mahendra singh dhoni manager

ఆమధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కొంతమంది ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన ఘటన అందరికీ గుర్తే వుంటుంది. అందులో పట్టుబడిన ఆటగాళ్ల జాతకాలు ఏమయ్యాయో తెలియదు కానీ.. దానివెనకున్న బడాబాబుల గురించి ఇంకా ముద్గల్ కమిటీ విచారణను కొనసాగిస్తూనే వుంది. ఇప్పటికే సమయం చాలా ఆలస్యం కావడం వల్ల దీనిని త్వరగా ముగించేసి సుప్రీంకోర్టుకు నివేదికను అందించాల్సి వుంది. అందుకే.. ఆ కమిటీ తనదైన తరహాలో వేగంగా విచారణను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది బడాబాబులతోపాటు ఆటగాళ్ల ఆర్థిక లావాదేవీలపై కూడా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి వాణిజ్య ఒప్పందాలు సమకూర్చే రితి స్పోర్ట్స్ యజమాని, అతడి మేనేజర్ అరుణ్ పాండేను కూడా విచారించినట్లు సమాచారం!

‘‘ధోనితో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఎంత మొత్తాన్ని అతడికి ఆఫర్ చేశారు? ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది?’’ అని తదితన ప్రశ్నలను పాండేను కమిటీ అడిగిందని తెలుస్తోంది. అలాగే ధోనితో వ్యాపార సంబంధాల గురించి కూడా ఆరా తీశారు. పాండేకు చెందిన రితీ స్పోర్ట్స్‌లో ధోనికి వాటాలున్నాయా అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ‘‘ఎన్ని కంపెనీలకు ధోని ఎండార్స్ చేస్తున్నాడు.. ఆ కంపెనీలు నిర్మాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయా?’’ అని కమిటీ పాండేను ప్రశ్నించినట్లు ఓ అధికారి తెలిపారు. అయితే కమిటీ అడిగిన ప్రశ్నలకు స్పందించేందుకు అరుణ్ పాండే నిరాకరించారు. మరోవైపు పాండేతోపాటు ఖేతర్ పాల్ ను కమిటీ ప్రశ్నించింది. పాండేతో వాణిజ్య సంబంధాల గురించి తనను ప్రశ్నించినట్లు ఖేతర్ పాల్ తెలిపారు. గతంలో మ్యాచ్ లు ఫిక్స్ చేసేందుకు పలువురు క్రికెటర్లకు ఈయన డబ్బులు ఆఫర్ చేశారనే ఆరోపణలున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles