Sachin tendulkar mentioned graig chappell as ring master in his book playing it my way

sachin tendulkar, sachin tendulkar playing it my way book, sachin tendulkar book, sachin tendulkar news, sachin tendulkar graig chappell, sachin tendulkar own story book, sachin tendulkar comments graig chappell, sachin tendulkar, indian cricket players, rahul dravid, vvs lakshman, saurav ganguly

sachin tendulkar mentioned graig chappell as ring master in his book playing it my way

చాపెల్ చెంప ఛెళ్లుమనిపించిన సచిన్.. ఎందుకు?

Posted: 11/04/2014 11:29 AM IST
Sachin tendulkar mentioned graig chappell as ring master in his book playing it my way

గ్రెగ్ చాపెల్.. ఒకప్పుడు భారతీయ జట్టుకు కోచ్ గా పనిచేసిన ఆస్ట్రేలియన్ మాజీ క్రీడాకారుడు! ఇతను కోచ్ గా వున్న సమయంలో ఎన్నో వివాదాస్పదాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా జట్టు పనితీరును ఎంతో ఘోరంగా వుండేది. అందుకు కారణం ఇతడే! ఎందుకంటే.. ఇతని బయటే ఎన్నోవివాదాలు చోటుచేసుకున్నాయంటే.. ఇంకా వెలుగులోకి రానివి ఎన్ని వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇతర వ్యవహారాల మాటేమోగానీ ప్రతి ఆటగాడు ఆ సమయంలో తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యేవాడని ఆవేదన వ్యక్తం చేసుకునేవారు. అయితే ఆనాడు తమ ఆవేదనను ఎవరూ బయటపెట్టలేదు కానీ.. నేడు భారతీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం తన ఆత్మకథలో వెల్లడించాడు. ‘‘ప్లేయింట్ ఇట్ మై వే’’ అనే పుస్తకాన్ని రాసిన సచిన్.. అందులో చాపెల్ వ్యవహార శైలిపై రాస్తూ.. అతనిని ఓ రింగ్ మాస్టర్ అని అతని మీదున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కేశాడు. మరి ఆయన ఎందుకలా అన్నాడో తెలుసుకుందామా... ఆ విశేషాలు అతని మాటల్లోనే..

2007 వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్‌కు కొద్ది నెలల సమయమే మిగిలి ఉంది. అప్పుడు జట్టుకు కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే ఒక రోజు చాపెల్ మా ఇంటికి ఒక అనూహ్యమైన ప్రతిపాదనతో వచ్చాడు. అది విన్న అనంతరం నేను, నా భార్య అంజలి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాం. అదేమిటంటే.. ద్రవిడ్‌ను పక్కకు తప్పించి నేను కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని, అందుకు సహకరిస్తానని ఆయన చెప్పారు. అలా చేస్తే.. రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌ను ఇద్దరం కలిసి శాసించవచ్చని గ్రెగ్ అన్నారు. ద్రవిడ్ పట్ల కనీస గౌరవం కూడా ప్రదర్శించకుండా ఆయన అలా మాట్లాడటం నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే నేను మరో మాట లేకుండా వెంటనే ఆ ప్రతిపాదనను తిరస్కరించాను. రెండు గంటలపాటు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ.. నేను మాత్రం ససెమిరా అంటూ వచ్చాను. దాంతో ఫలితం లేక వెనుదిరిగారు.

ఈ ఘటన జరిగిన కొన్నిరోజుల తర్వాత నేను బీసీసీఐకి ఒక సలహా ఇచ్చాను. ప్రపంచకప్‌కు జట్టుతో పాటు చాపెల్‌ను పంపిచ్చవద్దని.. ఆయన భారత్‌లో ఉంటేనే మంచిదని చెప్పాను. అవసరమైతే టోర్నీ సమయంలో సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకుంటారని బోర్డుకు వెల్లడించాను. కానీ ఆనాడు ప్రపంచకప్ భారత్ కు దురదృష్టకర రీతిలో ముగిసింది. ఆయన పర్యవేక్షణలో భారత జట్టు పరిస్థితి మరింత ఘోరంగా మారబోతోందని ఆ సమయంలో మాకందరికీ అనిపించింది. అయినా మేము ఏమీ చేయలేకపోయాం! భారత జట్టు బాగా ఆడినప్పుడు అందరి దృష్టి తనపై పడేలా చాపెల్ ప్రయత్నించడం, జట్టు విఫలమైనప్పుడు మాత్రం ఆటగాళ్లను ముందుకు తోసి తాను తప్పించుకోవాలని చూడటం తనకు బాగా గుర్తుందని తెలిపాడు సచిన్!

సౌరవ్ గంగూలీ పట్ల చాపెల్ వ్యవహరించిన తీరు మరింత ఆశ్చర్యాన్ని కలిగింది. నిజానికి గంగూలీ వల్లే చాపెల్ కు కోచ్ పదవి వచ్చింది. ఆ విషయం వాస్తవమేనని చాపెల్ కూడా అంగీకరించారు. కానీ.. ఈ కారణంగా తాను జీవిత కాలంపాటు గంగూలీ రుణం తీర్చుకుంటూ ఉండలేనని ఆయన చెప్పారు. అలాగే లక్ష్మన్ వ్యవహారంలో చాపెల్ తీరు చాలా విడ్డూరంగా అనిపించిందని తెలిపాడు. ఒకసారి లక్ష్మణ్‌ను ఓపెనర్‌గా ఆడాలని సూచిస్తే... దానిని అతను సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు గ్రెగ్ ‘‘నువ్వు జాగ్రత్తగా ఉండాలని, 32 ఏళ్ల వయసులో పునరాగమనం అంత సులభం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలని’’ నేరుగా లక్ష్మణ్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జట్టులో కొత్తవాళ్లను నింపాలని, సీనియర్లను పక్కన పెట్టాల్సిన అవసరం చాపెల్ బీసీసీఐకే చెప్పినట్లు తెలిసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  graig chappell  saurav ganguly  rahul dravid  vvs laxman  

Other Articles