Sachin tendulkar auto biography playing it my way book beats apple founder steve jobs life history book with pre orders

sachin tendulkar, sachin tendulkar auto biography, sachin tendulkar playing it my way book, sachin tendulkar auto biography book, sachin tendulkar book, sachin tendulkar life history book, sachin tendulkar latest news, playing it my way book, steve jobs news, apple founder steve jobs news

sachin tendulkar auto biography playing it my way book beats apple founder steve jobs life history book with pre-orders

ఇన్నాళ్లూ బ్యాటుతో... ఇప్పుడు ఆత్మకథతో...

Posted: 11/08/2014 12:24 PM IST
Sachin tendulkar auto biography playing it my way book beats apple founder steve jobs life history book with pre orders

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైదానంలో దిగితే చాలు... కేవలం భారతీయ అభిమానులే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా చూసే క్రికెట్ పిచ్చోళ్లు ఒక్కటే అరుపులతో ఆయనకు స్వాగతం పలుకుతారు. అదీ.. సచిన్ స్థాయి! క్రికెట్ ప్రపంచంలోనే సరికొత్త రికార్డులు బద్దలుకొడుతూ, సృష్టించుకుంటూ తనకంటూ చెరిగిపోని ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు. ‘‘గాడ్ ఆఫ్ క్రికెట్’’గా పేరుగాంచాడు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు అభిమానుల బలం తగ్గలేదంటే... అతను ఎంతటి దిగ్గజ క్రికెటరో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలావుండగా.. నిన్నటిదాకా బ్యాటుతో రికార్డులు తిరగరాసిన సచిన్.. రిటైర్ అయిన తర్వాత కూడా తన దూకుడును ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తంది. గురువారం సచిన్ లాంచ్ చేసిన తన ఆత్మకథ ‘‘ప్లేయింగ్ ఇట్ మై వే’’ పుస్తకానికి అప్పుడే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పుస్తకంలో సచిన్ తన క్రికెట్ అనుభవంతోపాటు అనుభవించిన బాధ, ఇతరుల వివాదాలు పూర్తిగా పొందుపరిచిన నేపథ్యంలో దానిని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులతోపాటు ప్రముఖులు సైతం పోటీపడుతున్నారు. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కేటగిరీల్లో అన్ని రికార్డులను తిరగరాస్తోందని ప్రచురణ కర్తలు పేర్కొంటున్నారు.

విడుదలకు ముందే ఈ పుస్తకానికి 1,50,000 కాపీల మేర ఆర్డర్లు వచ్చాయని ప్రచురణ కర్తలు వెల్లడిస్తున్నారు. ఈ దెబ్బతో సచిన్ పుస్తకం ‘‘యాపిల్’’ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవితచరిత్ర (1,30,000 కాపీలు) రికార్డును బద్దలకొట్టడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ ఆత్మకథను ప్రచురించిన హటిచే ఇండియా సంస్థ ఎండీ థామస్ అబ్రహాం మాట్లాడుతూ... సచిన్ పుస్తకం కూడా అతని బ్యాటులానే రికార్డులు నెలకొల్పుతోందని.. అయితే తమకేమీ అది అంతగా ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. తాజా రికార్డు నేపథ్యంలో పుస్తక రంగంలో సచిన్ అరంగేట్రంలోనే వెయ్యి సెంచరీలు కొట్టినట్టని అభివర్ణించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  steve jobs  apple software  playing it my way book  telugu news  

Other Articles