India vs australia first test cricket match young cricketer philip hughes

india vs australia, india australia cricket test series, india australia cricket matches, philip hughes, philip hughes death news, australian cricketer philip hughes, virat kohli, mahendra singh dhoni

india vs australia first test cricket match young cricketer philip hughes

తొలిటెస్టు మ్యాచు అల్లకల్లోలమే!

Posted: 11/28/2014 03:38 PM IST
India vs australia first test cricket match young cricketer philip hughes

శ్రీలంకతో ఐదువన్డేల సిరీస్’ను క్లీన్’స్వీప్ చేసిన భారత్... ఆస్ట్రేలియా జట్టుతో టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమైన విషయం తెలిసిందే! ధోనీకి గాయం కావడం వల్ల ఈ తొలిటెస్టు మ్యాచుకు కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు. అంతా అనుకున్నట్లుగానే అన్ని పనులు పూర్తయ్యాయిగానీ.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వున్న పరిస్థితులను చూస్తుంటే ఈ తొలి టెస్టు మ్యాచ్ జరగడం అనుమానమేనని అంటున్నారు. ఎందుకంటే.. దేశీయ క్రికెట్ మ్యాచ్’లో మెదడుకు తీవ్రగాయం కావడంతో ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్.. మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు మరణించాడు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

హ్యూస్ మరణం తాలుకు విషాద ఛాయల నుంచి తమ ఆటగాళ్లు ఇంకా కోలుకోలేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. దీంతో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్లో ఈ మ్యాచ్ ఆరంభంకావాల్సిన తొలిటెస్టు సందేహంగా మారింది. తొలి టెస్టును రద్దు చేస్తే బాగుంటుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. ఇదిలావుండగా.. హ్యూస్ మృతితో భారత్, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య శుక్ర, శనివారాల్లో జరగాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేశారు. మరి తొలిటెస్టు మ్యాచ్ ఆడుతారా..? లేదా..? అన్నది ఇంకా సందేహంగా వుండిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles