Sachin tendulkar shocks philip hughes death news sympathy indian cricket players bcci australian cricket board

sachin tendulkar, jphilip hughes, indian cricket players, sachin tendulkar latest news, sachin tendulkar philip hughes death news, bcci board, australia cricket board, yuvraj singh, sunil gavaskar

sachin tendulkar shocks philip hughes death news sympathy indian cricket players bcci australian cricket board

ఫిలిప్ మరణంతో షాక్ తిన్న సచిన్..

Posted: 11/28/2014 11:10 AM IST
Sachin tendulkar shocks philip hughes death news sympathy indian cricket players bcci australian cricket board

ఈనెల 25న సిడ్నీ స్టేడియంలో దేశీయ క్రికెట్ టోర్నీలో షాట్ల ఎంపిక సమయంలో జరిగిన చిన్న తప్పిదం వల్ల ఫిలిప్ దవడకు బంతి బలంగా తగిలిన విషయం తెలిసిందే. ఈ గాయం ధాటికి ఫిలిప్ అక్కడికక్కడే కుప్పకూలిపోవటంతో పాటు కోమాలోకి వెళ్ళాడు. డాక్టర్లు రెండ్రోజల పాటు తీవ్రంగా శ్రమించినా చికిత్స ఫలించకుండా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ దిగ్గజాలు అతని మరణంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అసలు ఇటువంటి విషాదగాధలు వినడానికే ఎంతో బాధకరంగా అనిపిస్తాయని.. అటువంటిది తోటి క్రీడాకారుడే మరణించడం జీర్ణించుకోలేకపోతున్నామని ప్రతిఒక్కరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అతని మరణంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా దిగ్ర్భాంతి వ్యక్తంచేశాడు.

ఐపీఎల్’లో ముంబయి ఇండియన్స్’కు హ్యూస్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో సచిన్’కి, అతనికి మధ్య సన్నిహితబంధం ఏర్పడింది. అతడు చాలా మంచోడని తెలిపిన సచిన్.. అతడి మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని ట్వీట్ చేశాడు. హ్యూస్ మరణవార్తపై సచిన్ స్పందిస్తూ.. క్రికెట్’కు చాలా విషాదకరమైన వార్తని అని పేర్కొన్నాడు. అతని మిత్రులకు, కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశాడు. హ్యూస్’లాంటి మంచి ప్లేయర్’ను కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా హ్యూస్ మరణవార్తపై స్పందించారు. అసలు ఇలాంటి వార్తలు వినడానికి ఎవరూ ఇష్టపడరని ఆయన పేర్కొన్నారు. విషాదంలో మునిగిపోయిన హ్యూస్ కుటుంబానికి, ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే యువరాజ్ సింగ్ కూడా స్పందిస్తూ.. క్రికెట్’కు చీకటి రోజని పేర్కొన్నాడు. ఇలా ఇండియన్ క్రికెటర్స్’తోబాటు బీసీసీఐ కూడా హ్యూస్ కుటుంబానికి సానుభూతి తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  sunil gavaskar  philip hughes  yuvraj singh  bcci  

Other Articles