Former indian cricketer bowler sreesanth interview ipl spot fixing case

sreesanth, indian cricketers, ipl spot fixing case, indian bowlers, telugu news

former indian cricketer bowler sreesanth interview ipl spot fixing case

గాడ్’ఫాదర్ లేకపోవడం వల్లే తన కెరీర్’పై ఫిక్సింగ్ జరిగిందట!

Posted: 12/02/2014 11:08 AM IST
Former indian cricketer bowler sreesanth interview ipl spot fixing case

ఐపీఎల్’లో మ్యాచ్’ఫిక్సింగ్’కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో టీమిండియా మాజీబౌలర్ శ్రీశాంత్ జీవితకాలం నిషేధానికి గురైన విషయం తెలిసిందే! ఈ వ్యవహారంపై తాజాగా మాట్లాడిన శ్రీశాంత్.. తాను ఆటకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని, ఆనాడు ఫిక్సింగ్’కు పాల్పడలేదని అన్నాడు. తాను ఫిక్సింగ్’కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు ఇంతవరకు రుజువు కాలేదని, అయినా తనను నిషేధించడం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. శత్రువులకు కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితులు రాకూడదని అతడు కోరుకున్నాడు.

ఈ వ్యవహారంపై శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి బీసీసీఐ తన వాదన కూడా వినిపించుకోకుండా ఐదునిముషాల్లోనే తన తలరాత మార్చేసిందని తెలిపాడు. ‘‘బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులు నా వాదనే వినలేదు. ఈ వ్యవహారాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని, విచారణ తర్వాత నిర్ణయం వెలువడుతుందని అన్నారు కానీ.. ఆ అధికారుల్ని కలిసిన ఐదునిముషాల్లో నేను నా కారు ఎక్కుతుండగా మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్లు వచ్చాయి. అప్పుడు వాళ్లంతా నాపై జీవితకాలం నిషేధం విధించినట్లు చెప్పడంతో ఒక్కసారిగా షాయ్యాను’’ అని అన్నాడు.

‘‘నాకెవరూ గాడ్’ఫాదర్ లేకపోవడం వల్లే నన్నిలా అడ్డంగా బుక్ చేసి, నిషేధించారు. నేనసలు ఆటకు వ్యతిరేకంగా ఎటువంటి పనీ చేయలేదు. కావాలనే కుట్రపన్ని నన్ను తీసేశారు. సరైన ఆధారాలు లేకుండా నా నిషేధ నిర్ణయాన్నితీసుకున్నారు. ఇప్పటిదాకా నేనా ఫిక్సింగ్’కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదు. నేనే తప్పు చేయకున్నా నన్నిలా నిషేధించడం న్యాయం కాదు’’ అని వెల్లడించాడు.

అలాగే నిషేధం తర్వాత తన జీవితం గురించి, తాను అనుభవిస్తున్న ఆవేదన గురించి మాట్లాడుతూ.. ‘‘మా ఇంటికి స్టేడియం 500 మీటర్ల దూరంలో వుంది. కానీ నాకు అందులో ప్రవేశం దొరకట్లేదు. ఎన్ని అనుమానాలను ఎదుర్కొన్న.. క్రికెట్ నుంచి తొలగించడమే నన్ను ఎక్కువ బాధ కలిగిస్తోంది. ఇటువంటి దారుణమైన పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు. టీమిండియాలో తిరిగి ఆడాలని లేదుకానీ.. కేరళకు ఆడాలన్నదే నా కోరిక. ఈ కేసునుంచి నేను నిర్దోషిగానే బయటపడుతానని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sreesanth  indian cricketers  ipl spot fixing case  indian bowlers  telugu news  

Other Articles