Praveen kumar petition madras high court india cricket team australia tour test match series philip hughes death news

india vs australia, india australia tour, india vs australia test series, petitioner praveen kumar, madras high court, philip hughes death news, india australia matches, madras high court news, supreme court of india

praveen kumar petition madras high court india cricket team australia tour test match series philip hughes death news

టీమిండియాను అడ్డుకోవాలంటూ కోర్టులో పిటిషన్?

Posted: 12/02/2014 11:33 AM IST
Praveen kumar petition madras high court india cricket team australia tour test match series philip hughes death news

టీమిండియా క్రికెట్ జట్టు ఈనెల 9వ తేదీనుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్’ఆడబోతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో ఇండియాజట్టు ఆస్ట్రేలియా వెళ్లడానికి బయలుదేరుతోంది. అయితే ఆస్ట్రేలియాలో పర్యటనను కొనసాగించకుండా భారత్ జట్టును వెంటనే అడ్డుకోవాలంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. లేకపోతే జట్టు ఆటగాళ్లకు చాలా ప్రమాదముందంటూ అతడు అందులో హెచ్చరికలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే అతని హెచ్చరికల వెనుక మంచి అభిప్రాయాలే వున్నాయి!

ఇటీవలే బౌన్సు బంతి తగిలి యువక్రికెటర్ ఫిలిప్ హ్యూస్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే! ఆ నేపథ్యంలో ఇండియన్ ఆటగాళ్లక్కూడా ముప్పు వాటిల్లే అవకాశముందనే ఉద్దేశంతోనే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఇలా పిటిషన్ వేసినట్లు సమాచారం! ఆస్ట్రేలియాలో మైదానాల్లో బౌన్సీ పిచ్’లని, దాంతో ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదముందని పిటిషనర్ వాదన! ఆటగాళ్లకు రక్షణ కల్పించకపోతే వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతడు వెల్లడించాడు.

1870 నుంచి క్రికెట్ బంతి తగిలి ఇప్పటికే నలుగురి ఆటగాళ్లు మరణించారని, ఆటగాళ్లకు పూర్తి రక్షణ ఇస్తే తప్ప భారతజట్టు ఆసీస్ పర్యటనను కొనసాగించరాదని అతడు పిటిషన్’లో పేర్కొన్నాడు. అతడు వేసిన ఈ పిటిషన్ వచ్చేవారం ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. అయితే పిటిషన్’లో అతడు పేర్కొన్న సూచనలు మంచి అభిప్రాయాలేనని కొందరు ప్రముఖులు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles