Title gif

india vs australia first test, india vs australia first test match, india vs australia match updates, india vs australia test scores, indian cricketers on phillip huges death, phillip huges death condolance, india sports updates

india australia first test updates : india vs australia first test first day completed by australia losing 6 wickets at 354 runs. india vs australia first test match completed day one with 6 wickets loss from opposite team

కంగారులను వెంటాడుతున్న ఫిలిప్ నీడ

Posted: 12/09/2014 02:54 PM IST
Title gif

ఫిలిప్ మరణం నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇంకా కోలుకున్నట్లు కన్పించటం లేదు. ఆడిలైడ్ లో భారత్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు గతంతో పోలిస్తే కాస్త మెతకగా ఆడుతోంది. తొలిరోజు ఆట మొదట్లో పరుగులు వేగంగా వెళ్లినా తర్వాత మందగించాయి. బాగా ఊపందుకుని బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు సడన్ గా పెవీలియన్  బాట పట్టారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మొత్తం 89.2 ఓవర్లలో 6వికెట్లు నష్టపోయి 354పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా ఆటగాళ్ళ స్కోర్లు ఇలా ఉన్నాయి :

సి.రోజర్స్ సి ధవన్ బి ఇషాంత్ 9; డేవిడ్ వార్నర్ సి ఇషాంత్ శర్మ బి కేవీ శర్మ 145; ఎస్ వాట్సన్ సి ధవన్ బి ఆరోన్ 14; మైఖేల్ క్లార్క్ రిటైర్డ్ హర్ట్ 60; ఎస్ స్మిత్ నాటౌట్ 72; ఎంఆర్ మార్ష్ సి కోహ్లీ బి ఆరోన్ 41; ఎన్ఎం లియాన్ బి మహ్మద్ షమీ 3; బీజే హడిన్ సి సాహా బి షమీ 0; ఎక్స్ట్రాలు 10

భారత బౌలర్ల వికెట్లు పొందిన వివరాలు ఇలా ఉన్నాయి :

మహ్మద్ షమీ 17.2-1-83-2, వరుణ్ ఆరోన్ 17-1-95-2, ఇషాంత్ శర్మ 20-4-56-1, కేవీ శర్మ 23-1-89-1, మురళీ విజయ్ 12-3-27-0.

ఆటలో తొలిరోజు కేవలం ఆస్ట్రేలియా జట్టు క్రీడాకారులే కాకుండా భారత ఆటగాళ్ళు కూడా విచారంగా కన్పించారు. ఆట సమయంలో హ్యూస్ కు రెండు జట్లు మౌనం పాటించి నివాళి అర్పించాయి. ఈ సందర్బంగా వార్నర్ కన్నీరు పెట్టుకున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia test  phillip huges condolance  sports news updates  

Other Articles