Difficult to ignore n srinivasan s conflict of interest says supreme court

srinivasan, bcci, ipl betting scam, supreme court, icc, gurunaath mayyappan, sreeshanth

The Supreme Court on Monday said it is very difficult to accept that there is no conflict of interest in N Srinivasan's role as the BCCI president and owner of IPL franchise Chennai Super kings.

ఐ సి సి చైర్మన్ శ్రీనివాసన్ పై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు

Posted: 12/08/2014 06:38 PM IST
Difficult to ignore n srinivasan s conflict of interest says supreme court

2013 లో సంచలనం సృష్టించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్ వ్యవహారంలో సుప్రీమ్ కోర్ట్ తీవ్రంగా స్పందించింది. అపుడు జరిగిన బెట్టింగ్ కుంభకోణంలో అప్పటి బి సి సి ఐ అధ్యక్షుడైన శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మయ్యప్పన్ , వింద్ దార సింగ్ లను  బూకీస్ లతో సంబంధాలున్నాయన్న అభియోగాలతో వారిద్దరిని ముంబై పోలీసులు, స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలతో క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో సుప్రీం కోర్ట్  అప్పటి బి సి సి ఐ అధ్యక్షుడైన శ్రీనివాసన్ కు పలు సూచనలను జారి చేసింది. విచారణ సక్రమంగా సాగేలా తన పదవి నుండి తప్పుకోవాలని సూచించింది. అప్పటి నుండి ఈ కేసుని సుప్రీం కోర్ట్ పరిశీలిస్తూ వస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్న కేసు విచారణలో భాగంగా శ్రీనివాసన్ వైఖరిని కోర్ట్ తప్పు పట్టింది. శ్రీనివాసన్ కి దంద్వ ప్రయోజనాలు లేవంటే నమ్మేదెలా అంటూ ఈ కేసు విచారిస్తున్న ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బెట్టింగ్ కుంభకోణం జరిగినప్పుడు ఆయన బి సి సి ఐ అధ్యక్షుడిగా ఉన్నారని, ఆయన అల్లుడు గురునాథ్ మయ్యప్పన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్రాంచైజీకి ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నాడని పేర్కొంది. ఆ హొదాల్లో వారు అభియోగాలకి దూరంగా ఉండి ఆట స్వచ్ఛతని కాపాడాల్సిన బాధ్యత తీసుకొని ఉండాల్సిందని కోర్ట్ అభిప్రాయపడింది.

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : N Srinivaasan  gurunath mayyappan  cricketer sreeshanth  supreme court.  

Other Articles