Shoaib malik says marriage with sania still strong

Shoaib Malik marriage with Sania strong, marriage is strong bond says shoaib, pakistan cricketer shoaib malik, sania and i are happy says shoaib, have happy married life sith sania, Cricket, Sania Mirza, Sania Mirza marriage, Shoaib Malik, Shoaib-Sania marriage, Indian tennis star Sania Mirza, sania and i have no differences, no problems between sania and me

Pakistan cricket's senior all-rounder Shoaib Malik insists that he is having a happy married life with Indian tennis star Sania Mirza and that there are no differences or problems between the couple.

పెళ్లంటే నూరేళ్ల పండగ.. ఆ బంధం ధృడమైనదంటున్న క్రికెటర్

Posted: 12/20/2014 04:05 PM IST
Shoaib malik says marriage with sania still strong

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఎట్టకేలకు తమ వైవాహిక జీవితంపై చాలా కాలం తర్వాత పెదవి విప్పాడు. సానియా, షోయబ్ ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయని  భారత్ లోని మీడియాతో పాటు పాకిస్థాన్ మీడియాలో కూడా తరుచు వార్తలు  రావడంతో ఎట్టకేలకు షోయబ్ స్పందించాడు.  తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నొక్కిచెప్పాడు. ప్రస్తుతం తామిద్దరం దుబాయ్ లో ఉన్నామన్నాడు. తమ సంతోషకరమైన వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పాడు. తమ మధ్య ఎటువంటి బేధాభ్రిపాయాలు లేవన్నారు. తమ జీవితం సాఫీగానే నడుస్తుందని, ఒక జంటగా మా మధ్య సమస్యలు అనేవి లేవని, పెళ్లంటే నూరేళ్ల పంట అంటూ చెప్పుకోచ్చాడు.
 
తామిద్దరం వృత్తిపరంగా కూడా ఎంతో నిబద్దత ఉన్నామన్నాడు. ఇద్దరం కలసి ఖళీ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్నామని చెప్పాడు. అయితే ఇద్దరు సెలిబ్రెటీలు అయినందున వృత్తిపరమైన సమస్యలు కూడా తమ వైవాహిక జీవితంపై ప్రభావం చూపలేదన్నాడు. తమ మద్య ఆలుమగల బంధం బెడసి కోట్టిందని కోన్ని వార్థ పత్రికల్లో కథనాలు చూసి షాక్ కు గురైనట్లు చెప్పాడు. పాకిస్థాన్ నటి హుమైమాతో పాటు అమె కుటుంబంతో సన్నిహితంగా మెలగడానికి గల కారణాలను మీడియా ప్రశ్నించగా.. సానియా తన భార్య అని అమెతో తన వివాహ బంధం సవ్యంగా సాగుతుందని చెప్పిన షోయబ్, హుమైమా తనకు ఒక మంచి స్నేహితురాలని పేర్కొన్నాడు.

ఇదే సందర్భంలో ఆయన ప్రపంచ కప్ లో తాను అడబోనన్న పాకిస్థాన్ మీడియా కథనాలను కూడా షోయబ్ ఖండించారు, వచ్చే ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తరపున అడనున్నారా అన్న ప్రశకు షోయబ్ దాటవేత ధోరణి అవలంభించాడు. తాను ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో పాల్గొనడం లేదని ఎప్పుడూ చెప్పులేదు కదా! అని షోయబ్ మీడియాను ప్రశ్నించాడు. తాను పాకిస్థాన్ క్రికెట్ కు ఎప్పుటూ అందుబాటులో ఉంటానన్నాడు. అయితే గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ తరపున ఆడుతున్న క్రికెటర్లకు సెలక్టర్లు అవకాశం ఇవ్వాలని తాను అభిప్రాయపడినట్లు చెప్పాడు. పాకిస్థాన్ కోసం అడేందుకు తాను ఎప్పుడు సిద్దంగానే వున్నట్లు చెప్పుకోచ్చారు. తాను ఈ రోజు ఓ స్థాయిలో వుండటానికి కారణం కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డేనని, తాను ఈ విషయాన్ని ఎలా విస్మరించగలనన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shoaib Malik  Sania Mirza  tennis  cricket  India  pakistan  

Other Articles