Pakistan cricketer saeed ajmal shut cricket academy extremists threats

saeed ajmal news, pakistan cricketer saeed ajmal, saeed ajmal cricket academy, indian cricketers, indian cricket academys, pakistan terrorists attacks, terrorists attacks

pakistan cricketer saeed ajmal shut cricket academy Extremists threats : Saeed Ajmal Forced to Shut Cricket Academy Due to Threats From Extremists

ఉగ్రదాడుల భయానికి పాక్ క్రికెటర్ పరార్!

Posted: 01/09/2015 07:31 PM IST
Pakistan cricketer saeed ajmal shut cricket academy extremists threats

ఇటీవలకాలంలో పాకిస్తాన్’లో ఉగ్రవాదుల దాడులు పెచ్చుమీరిపోయిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా అగ్రస్థానంలో వున్నవారిని టార్గెట్ చేసుకుని వారు బెదిరింపు హెచ్చరికలు పంపుతున్నారు. అందుకే ప్రతిఒక్కరు రక్షణ వలయాలను ఏర్పరుచుకుంటున్నారు. మరికొంతమంది తమ సంస్థలకు తాళాలు వేసుకుని అక్కడి నుంచి పారిపోతున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ పాకిస్తాన్ క్రికెటర్ కూడా చేరిపోయాడు.

పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్’గా పేరుగాంచిన సయీద్ అజ్మల్ కొంతకాలం నుంచి తన స్వస్థలం ఫైజలాబాద్’లోని విశ్వవిద్యాలయ భూముల్లో ఓ క్రికెట్ అకాడమీని నడుపుతున్నాడు. అయితే ఇంతలోనే ఉగ్రవాదుల దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే అజ్మల్ అకాడమీకి కూడా అతివాద శక్తుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం! దీంతో ఇతగాడు తన అకాడమీని తాత్కాళికంగా మూసివేస్తున్నట్లు తెలిపి.. అక్కడి నుంచి వేరేచోటుకు మకాం మార్చుకున్నాడు. తనకు ఈమేరకు పంజాబ్ ప్రభుత్వం సూచనలు ఇచ్చినట్లు తెలిపాడు.

ఈ వ్యవహారంపైనే చర్చించేందుకు అజ్మల్ మొదట ఫైజలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆప్ పోలీస్’ను, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్’లో కలిసినట్లు మీడియాకు తెలిపాడు. ఈ ఉగ్రవాదుల దాడుల ముగిసేవరకు తన అకాడమీని మూసివేస్తున్నట్లుగా స్పష్టం చేశాడు. ఇదిలావుండగా.. ఇతనితోబాటు చాలామందికి ఇప్పటికే బెదిరింపులు వచ్చాయి. వాళ్లు కూడా తమ మకాంలను మార్చుకున్నట్లు తెలిసింది. మరి.. ఈ వ్యవహారం ఇంకెన్నాళ్లవరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles