Team india s new odi kit launched

Team India new ODI jersey, ODI jersey unveiled, Team India's new ODI kit launched, nike, official apparel sponsor, triangular series in Australia, Indian cricketers striking in new ODI kit, latest Team India uniform, new design, Nike Dri-FIT technology, Nike Pro Baselayer, australia melbourne,

Nike, the official apparel sponsor of the Cricket Board (BCCI), on Thursday unveiled Indian team's new one-day international kit which the players will sport in the triangular series in Australia starting on Friday.

నూతన యూనిఫాంలో మెరిసిన టీమిండియా ఆటగాళ్లు..

Posted: 01/15/2015 04:35 PM IST
Team india s new odi kit launched

భారత క్రికెట్ వరల్డ్ కప్ జట్టు ఆటగాళ్లు కొత్త డ్రెస్సులలో మెరిసిపోయారు. భారత్ క్రికెట్ జట్టు అధికారిక దుస్తుల స్పాన్సర్ అయిన నైకీ భారత జట్టుకోసం కొత్త ఏకరూప దుస్తుల కిట్‌ను గురువారం ఆవిష్కరించింది. ఐసిసి ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ ముందు వస్తున్న.. ముక్కోణపు వన్డే సీరీస్ లో ఆటగాళ్లు ఈ దుస్తులనే ధరించే ఆడనున్నారు. మెల్బోర్న్లోని న్యూ జెర్సీలో నైక్ ఈ నూతన దుస్తులను ఆవిష్కరించింది. ఈ యూనిఫాంల కోసం సగటున 33 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఒకో కిట్ను నైకీ తయారు చేసింది.  

అంతేకాకుండా కొత్త యూనిఫాం కోసం ఆటగాళ్లందరి అభిప్రాయం కూడా తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆటగాళ్ల ప్రతిభను దృష్టిలో పెట్టుకుని డ్రై-ఫిట్ టెక్నాలజీతో ఈ జెర్సీలను తయారు చేశామని, ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉండేలా.. వారు ఆటపై దృష్టి పెట్టేందుకు కొత్త దుస్తులు దోహదపడతాయని తెలిపింది. మైదానంలో క్రికెటర్ల కదలికలను దృష్టిలో పెట్టుకుని వారికి పూర్తి సౌకర్యంగా ఉండేలా, ఎంతో పరిశోధన చేసి ఈ దుస్తులను ప్రత్యేకంగా రూపొందించినట్లు నైకీ పేర్కొంది. కొత్త యూనిఫామ్ ఎంతో తేలికగా, సౌకర్యంగా ఉందని జట్టు కెప్టెన్ ధోనీ తెలిపారు. క్రికెట్ యూనిఫామ్ అంటే కేవలం దుస్తులు కాదని, భారతీయ క్రీడాస్ఫూర్తిని అది ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా ధోనీ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sports  team india  australia  new jersey  

Other Articles