Pakistan former cricketer imran khan defamation suit former chief justice iftikar

imran khan news, imran khan defamation suit, former cricketer imran khan news, defamation suit news, pakistan crime news, pakistan news

pakistan former cricketer imran khan defamation suit former chief justice iftikar : former chief justice iftikar filed defamation suit on pakistan former cricketer imran khan for blaming him

పరువు తీశాడంటూ ఇమ్రాన్’పై 20 బిలియన్ల దావా

Posted: 01/21/2015 01:38 PM IST
Pakistan former cricketer imran khan defamation suit former chief justice iftikar

పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్’గా మారుతున్నట్లు కనిపిస్తున్నాడు. నిత్యం పాక్ ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లోకెక్కే ఈ పొలిటిషియన్.. ఇటీవలే ఓ మాజీ టీవీ యాంకర్’ను పెళ్లి చేసుకుని సంచలనంగా నిలిచిన విషయం తెలిసిందే! ఇప్పటికీ ఆ వ్యవహారంపై పాక్’లో వాడీవేడీగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతలోనే ఇమ్రాన్ మరో వివాదంతో తెరమీదకు వచ్చేశాడు.

పరువు, ప్రతిష్టలను దిగజార్చాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈ మాజీ కెప్టెన్’పై ఏకంగా 20 బిలియన్ల పరువునష్టం దావా దాఖలైనట్లు సమాచారం! ఈ దావాను పాక్ మాజీ చీఫ్ జస్టిప్ అయిన ఇఫ్తికార్ చౌదరి వేశారు. 2013 సాధారణ ఎన్నికల నేపథ్యంలో చౌదరి రిగ్గింగ్’కు పాల్పడ్డారని ఇమ్రాన్ ఆరోపణలు చేశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. తన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు.

ఈమేరకు చౌదరి స్థానిక జిల్లా కోర్టులో ఇమ్రాన్’పై రూ.20 బిలియన్ల పరువునష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన అనంతరం స్వీకరించిన కోర్టు.. ఈనెల 29వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఇమ్రాన్’ను ఆదేశించింది. ఒకవేళ ఇమ్రాన్ చేసిన ఆరోపణలు రుజువైతే.. అతనికి భారీ నష్టంలో మూల్యం చెల్లించడంతోబాటు పరువు, ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan former cricketer imran khan  defamation suit  

Other Articles