Ahendra singh dhoni suggestions fellow players dressing room wriddhiman saha

mahendra singh dhoni news, mahendra singh dhoni latest news, wriddhiman saha news, virat kohli news, rohit sharma news, india dressing room, australia india tour, indian cricket team, india team news, dhoni latest upates

mahendra singh dhoni suggestions fellow players dressing room wriddhiman saha

డ్రెస్సింగ్ రూమ్’లో ధోనీ వ్యాఖ్యానాలను లీక్ చేసిన కీపర్..

Posted: 01/21/2015 12:54 PM IST
Ahendra singh dhoni suggestions fellow players dressing room wriddhiman saha

సాధారణంగా క్రికెటర్లకు ఏ ప్రాంతానికి వెళ్లినా వారకంటూ ఓ ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్’ను యాజమాన్యం ఏర్పాటు చేయడం సహజం! ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వున్న ఇండియాకు అక్కడా ఓ రూమ్’ని కేటాయించారు. అయితే.. ఆ రూంలో కెప్టెన్ ధోనీ తన తోటి క్రికెటర్లతో అన్న కొన్ని వ్యాఖ్యనాలను యంగ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా లీక్ చేశాడు. జట్టు మీద ధోనీ అభిప్రాయమేంటి..? ఆటగాళ్ల మీద అతని భావన ఎలా వుంది..? అన్న అంశాలపై జరిగిన చర్చలో భాగంగా ధోనీ చెప్పిన మాటలను సాహా వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్’లో భాగంగా భారత్ ఘోరంగా విఫలం అయిన నేపథ్యంలో మధ్యలోనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే! ఆ సమయంలో ధోనీ తన తోటి సహచరులతో డ్రెస్సింగ్ రూమ్’లో కొన్ని భావాలను పంచుకున్నాడు. ఇన్నాళ్లూ దాగివున్న ఆ వ్యవహారాన్ని తాజాగా వికెట్ కీపర్ సాహా పూర్తిగా వెల్లడించాడు. ప్రస్తుతమున్న టెస్టు జట్టుపై ధోనీ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడని, రానున్న రోజుల్లో జట్టుకు ఇప్పుడున్న ఆటగాళ్లే కీలకంగా వుంటారని ధోనీ అభిప్రాయపడినట్లు అతడు తెలిపాడు.

‘‘వచ్చే ఎనిమిదేళ్ల వరకు ఇప్పుడున్న భారత్ జట్టు ఇంకా బలంగా వుండనుది. అందివచ్చిన ప్రతిఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మీరంతా అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాల్సి వుంది’’ అంటూ తమ ఆత్మస్థైర్యం పెరిగేలా ధోనీ సలహాలు ఇచ్చినట్లుగా సాహా తెలిపాడు. అనంతరం.. అతడు టెస్టు మ్యాచుల నుంచి రిటైర్ ప్రకటించడంపై బాధ వ్యక్తం చేశాడు. ధోనీ ఒక గొప్ప కెప్టెన్ అని అతడు కితాబిచ్చాడు. ఇతరులను ఎంకరేజ్ చేయడంలో ధోనీ ఎల్లప్పుడూ ముందుంటాడనే అభిప్రాయాన్ని తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  wicket keeper wriddhiman saha  rohit sharma  

Other Articles