England cricket captain blackmailed over affair

Eoin Morgan news, Eoin Morgan blackmailed, Eoin Morgan love affairs, Eoin Morgan sex affairs, Eoin Morgan physical affairs, Eoin Morgan affairs, Eoin Morgan affairs blackmail, Eoin Morgan blackmail news, Eoin Morgan australia cricketer, australia cricket captain Eoin Morgan news

England one-day captain Eoin Morgan was recently the target of a blackmail attempt by an Australian man

డబ్బిస్తావా..? సరసాలను భట్టబయలు చేయమంటావా..?

Posted: 01/23/2015 08:06 PM IST
England cricket captain blackmailed over affair

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ఇటీవల బ్లాక్ మెయిలింగ్ కు గురయ్యాడు. తాను అడిగిన డబ్బును ఇస్తావా లేక తన సరసాలను భట్టబయలు చేయమంటావా అంటూ ఓ వ్యక్తి మోర్గన్ ను బ్లాక్ మెయిల్ చేశాడు. అదికూడా ఐదేళ్ల కిందట అప్పటి ప్రియురాలితో జరిపిన స్రేమాయణం తాలుకూ సరసాల ఫోటోలను భయటపెడతానని బెదిరించాడు. అలా చేయకుండా వుండాలంటే.. తాను అడిగిన ఐదెంకల మొత్తాన్ని తనకివ్వాలని.. ఇందుకు సమ్మతమేనా అంటూ బెదరించాడు. వినడానికే చోద్యంగా అనిపిస్తున్నా ఇది పచ్చి వాస్తవం.

ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ఇయాన్ మోర్గన్ ఐదేళ్ల కిందట ఒక యువతితో ప్రేమాయాణాన్ని నడపాడని ఆ విషయాన్ని తాను బ్రీటీష్ సహా ఆస్ట్రేలియా మీడియాకు లీక్ చేస్తానని బెదిరిస్తూ అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి మోర్గన్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ మెయిల్ పంపారని బోర్డు తెలిపింది. ఈ మేరకు తమకు ఈ- మెయిల్ అందిందని పేర్కొంది. మెయిల్‌లో వ్యక్తి.. భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఈసీబీ చెప్పింది.

బ్రిటన్ పోలీసులతో కలిసి ఈసీబీ.. ఆ వ్యక్తిని ఆచూకి కనుగొంది. ప్రస్తుతం ఆ వ్యక్తి.. ఆ ఆస్ట్రేలియన్ యువతితో కలసి ఉంటున్నాడు. బ్లాక్ మెయిల్ చేసినందుకు అతడు క్షమాపణ చెప్పినట్లు ఈసీబీ తెలిపింది. ''జట్టు ప్రపంచకప్ సన్నాహకాలకు సన్నధమవుతున్న తరుణంలో ఆటంకం కలిగించే ఎవరినీ వూపేక్షించం. వెంటనే సమస్య పరిష్కారమైనందుకు సంతోషంగా ఉంది'' అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : England  Sport  Cricket  Eoin Morgan  

Other Articles