Bcci gives wicb new deadline for compensation riposte

bcci board, west india cricket board, cricket compensation, west indies cricket team, india cricket team, Board of Control for Cricket in India, west india vs india matches, bcci wicb news

The West Indies Cricket Board (WICB) has been given until Tuesday to respond to the Board of Control for Cricket in India (BCCI) $42 million compensation claim for abandoning midway the Test and ODI series last year.

పరిహారం చెల్లిస్తారా..? న్యాయపరమైన చర్యలు తీసుకోమంటారా..?

Posted: 01/24/2015 05:15 PM IST
Bcci gives wicb new deadline for compensation riposte

భారత్ కు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ)కి మరో డెడ్ లైన్ విధించింది బిసీసీఐ. గత ఏడాది అక్టోబర్ మాసంలో భారత్ పర్యటనకు వచ్చిన విండీస్ ఆటగాళ్లు.. అకస్మికంగా పర్యటన ముగియకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో నష్ట పరిహారం అంశానికి సంబంధించి బీసీసీఐ మరోసారి డెడ్ లైన్ విధించింది.  గతేడాది అక్టోబర్ లో విండీస్ ఆకస్మికంగా భారత పర్యటన నుంచి వైదొలగడంపై 42 మిలియన్ డాలర్ల (రూ.245.6కోట్లు) దావాను బీసీసీఐ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ఒకసారి గడువు ఇచ్చిన బీసీసీఐ మంగళవారంలోగా డబ్యూఐసీబీ స్పందించాల్సిన అవసరం ఉందని ఈ మెయిల్ ద్వారా స్పష్టం చేసింది.
 
విండీస్ క్రికెట్ బోర్డుతో తమకు జరిగిన చర్చలు సానూకూల ఫలితాలను వెలువరించడంలో విఫలం కావడంతో భారత్ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం మ్యాచులను అన్నింటినీ ఆడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయింది విండీస్ జట్టు. విండీస్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు మద్య పారితోషకాల విషయంలో చర్చలు ప్రతిఫలించని కారణంగా విండీస్  క్రికెటర్లు తన పర్యటన రద్దు చేసుకుని ఆ దేశ బోర్డుకు గట్టి షాక్ ఇచ్చారు.. ఒప్పందం ప్రకారం ఇంకా ఒక వన్డే మిగిలి ఉండగానే విండీస్ క్రికెట్ జట్టు పర్యటన రద్దు చేసుకుంది.  ఆ నేపథ్యంలో ఒకే వన్డే మ్యాచ్ తో పాటు భారత-విండీస్ ల టెస్ట్ సిరీస్ కు గండిపడింది. దీంతో విండీస్ బోర్డు తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ బీసీసీఐ దావా దాఖలు చేయగా అందుకు సంబంధించిన గడువు ముగిసింది. దీంతో మరో మారు గడుపును విధించించి బీసిసిఐ. మంగళవారం లోపు విండీస్ క్రికెట్ బోర్డు స్పందించని పక్షంలో ఎలాంటి సమాచారం లేకుండానే న్యాయపరమైన చర్యలను తీసుకుంటామని బీసీసీఐ విండీస్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wicb  bcci  cricket  compensation  

Other Articles