Padma shri came as a pleasant surprise mithali raj

Mithali Raj surprised for award, Mithali Raj. Surprised selected for Padma Shri, padmashri to mithali raj, Indian women's cricket team captain Mithali Raj, Mithali Raj, Mithali Raj photos, Mithali Raj profile, Mithali Raj achivements, Mithali Raj records, Mithali Raj twitter, mithali raj biography,

Surprised at being selected for the Padma Shri, Indian women's cricket team captain Mithali Raj says she was not expecting the prestigious honour with some men's team superstars also in the race.

పద్మ అవార్డు.. నా తల్లిదండ్రులకు అంకితం

Posted: 01/27/2015 05:12 PM IST
Padma shri came as a pleasant surprise mithali raj

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మా అవార్డుల్లో తన పేరు ఉండటం పట్ల భారత మహిళల క్రికెట్ కెప్టన్ మిథాలి రాజ్ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఈసారి పద్మ అవార్డుల్లో భారత క్రికెట్ సూపర్‌స్టార్లు కెప్టెన్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి కూడా రేసులో వుండటంతో తనకు అవార్డు రాదని తెలసిన మిథాలీరాజ్ కు కేంద్రం ప్రతిష్టాత్మక పధ్మశ్రీ అవార్డును ప్రకటించడంతో ఆమె అనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది నిజంగా ఏమాత్రం ఊహించని పరిణామమని, చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటిదాకా 153 వన్డేలు, 10 టెస్టులు, 47 టి20 మ్యాచ్‌లు ఆడింది.
 
కోహ్లితో పోటీ అనగానే ఆశ వదులుకున్నా: నిజాయితీగా చెప్పాలంటే పద్మశ్రీ అవార్డుకు క్రికెటర్ల నుంచి నాకు పోటీగా కోహ్లి ఉన్నాడనగానే ఆశలు వదులుకున్నానని చెప్పింది. ఎందుకంటే పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మేమెక్కడో ఉంటామని చెప్పింది. అందుకే కోహ్లిలాంటి స్టార్‌ను కాదని తనను అవార్డుకు ఎంపిక చేస్తారనుకోలేదన్నారు.  కానీ జాబితాలో నా పేరు చూసి ఎంతగానో ఆశ్చర్యపోయానంది ప్రతిభకు తగిన పురస్కారంగా అమె చెప్పారు. తన చిత్తశుద్ధిని, అంకితభావాన్ని గుర్తించారనడానికి కేంద్ర అవార్డులు నిదర్శనంగా నిలుస్తాయి. తాను ఆడటం ప్రారంభించే నాటికి మహిళల క్రికెట్‌పై ఎక్కడా అవగాహన లేదన్నారు. అసలు మహిళల క్రికెట్ జట్టు కూడా ఉందనే విషయం ప్రజలకు తెలీదని.. అలాంటి స్థితి నుంచి మహిళల క్రికెట్‌ను కూడా ఫాలో కావాలనే కోరిక ప్రజల్లో కలిగించేలా చేశామని చెప్పకోచ్చారు.
 
కేంద్రం పురస్కారాన్ని తన తల్లిదండ్రులకు అంకితం చేస్తానని, తన కెరీర్ కోసం వారు ఎంతగానో కష్టపడ్డారని.. చాలా వాటిని త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పారు. భారత్‌లో క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకున్న తనకు దక్కిన ఈ అవార్డు యువ క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఐసీసీ కొత్త ఫార్మాట్ ప్రకారం మేం మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడగలమని అనుకుంటున్నాని తెలిపింది. ఇంతకుముందు చాలా తక్కువ అంతర్జాతీయ సిరీస్‌ల గురించి అభిమానులు, మీడియా పట్టించుకునేది. అయితే ఇకనుంచి ఎక్కువగా మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithali Raj  padmasri Award  surprise  

Other Articles