Sreesanth virat kohli anushka sharma love affair madhura sridhar reddy movie news

sreesanth news, sreesanth movie news, sreesanth telugu movies, madhura sridhar reddy sreeshanth, sreesanth sridhar reddy movie, sreesanth marriage news, sreesanth latest updates, sreesanth affairs, virat kohli anushka sharma, virat anushka love affair

sreesanth virat kohli anushka sharma love affair madhura sridhar reddy movie news : telugu director madhura reddy is planning to take movie with former indian bowler sreesanth which is based on virat kohli anushka sharma love affair.

విరాట్-అనుష్కల ప్రేమ రహస్యాలను రివీల్ చేస్తున్న శ్రీశాంత్...

Posted: 01/28/2015 07:19 PM IST
Sreesanth virat kohli anushka sharma love affair madhura sridhar reddy movie news

డైనమిక్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సెక్సీ బ్యూటీ అనుష్క శర్మల మధ్య గతకొన్నాళ్ల నుంచి ప్రేమాయణం నడుస్తున్న విషయం అందరికీ విదితమే! వీరిద్దరూ పార్టీలు, పబ్బులకు, ఆఖరికి టూర్లకు సైతం విచ్చలవిడిగా తిరగేస్తున్నారు. పెళ్లికిముందే తమ ప్రేమ జీవితాన్ని బాగానే ఆస్వాదిస్తున్నారు. కెమెరాకి చిక్కితే ప్రాబ్లమ్స్ వస్తాయన్న భయం లేకుండా భార్యాభర్తలు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ పోజులిచ్చేస్తున్నారు. మరొక విషయం ఏమిటంటే.. పెళ్లికాకముందే ‘హాట్ పెయిర్’ అంటూ వీరికి గుర్తింపు కూడా లభించింది. ఈ విషయాలు అందరికీ తెలిసిందే కానీ.. వీరిమధ్య కొనసాగిన మరిన్ని ప్రేమ రహస్యాలను బహిర్గతం చేసేందుకు భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సన్నద్ధమవుతున్నాడని సమాచారం!

అవును.. విరాట్, అనుష్క ఇద్దరూ మొదట్లో ఎలా కలుసుకున్నారు..? వారిమధ్య ప్రేమబంధం ఎలా ఏర్పడింది..? ప్రేమలో పడిన తర్వాత వారి జీవితం ఎలా సాగింది..? ఇతరత్ర విషయాలతోపాటు మరిన్ని ప్రేమరహస్యాలను బయటపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతగాడు వీరి గురించి మొత్తం వివరాలను సేకరించుకుని తన దగ్గరే వుంచుకున్నాడు. అయితే.. సమయం వచ్చినప్పుడు వారిద్దరి బండారాన్ని బయటపెడతానని చెబుతున్నాడు. అయితే.. అనుష్క-విరాట్ రియల్ లవ్ స్టోరీని శ్రీశాంత్ రీల్’లో పొందుపరిచి చూపిస్తానంటున్నాడు. అసలు మేటర్ సరిగ్గా అర్థం కావడం లేదు కదా..! అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

ప్రముఖ దర్శకుడు శ్రీధర్ రెడ్డి మాజీ క్రికెటర్ శ్రీశాంత్’తో కలిసి ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మూవీ కథ ‘అనుష్క-విరాట్’ ప్రేమకథ తరహాలోనే వుంటుందని ఆయన తెలిపారు. ‘‘విరాట్ కోహ్లీ, అనుష్కల ప్రేమకథ తరహాలోనే క్రికెటర్, యాక్టర్ మధ్య జరిగిన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఈ చిత్రం మొత్తం బెట్టింగ్ బ్యాక్ డ్రాప్’లో రూపొందిస్తున్నాం. త్వరలోనే సినిమా టైటిల్’ని అనౌన్స్ చేస్తాం’’ అని ఆయన అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే ఆ మూవీకి సంబంధించిన పనులను యూనిట్ బృందం సిద్ధం చేస్తుండగా.. విరాట్ పాత్రలో ఒదిగిపోయేందుకు శ్రీశాంత్ కసరత్తు చేస్తున్నాడు.

ఇదిలావుండగా.. మధుర శ్రీధర్ రెడ్డి తాజాగా నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్’మెన్’ చిత్రం జనవరి 30 తేదీన విడుదలకు సిద్ధమైంది. తర్వాత తన శిష్యుడైన సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఓం మంగళం మంగళం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో శ్రీశాంత్ తో కలిసి తీయబోతున్న చిత్రం షూటింగ్’ను కూడా స్టార్త్ చేస్తారని యూనిట్ బృందం తెలుపుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sreesanth telugu movie  anushka virat love affairs  madhura sridhar reddy  

Other Articles