2011 అంతర్జాతీయ క్రికెట్ వరల్డ్ కప్ ను సాధించి 28 ఏళ్ల నిరీక్షణకు బ్రేకులు వేసిన టీమిండియా.. మరో మారు ప్రపంచ ఛాంపియన్ల బిరుదును నిలబెట్టుకోనున్నారా..? అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. ఇందుకు మరో కారణం టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి. ఆయన నాయకత్వంలోనే టీమిండియా ప్రపంచ కప్ ను సాధించింది. ఈ ఘనతను సాధించడం అప్పటికి భారత్ రెండో సారి. ఈ సారి జరగనున్న 11వ ప్రపంచ కప్ క్రికెట్ టార్నమెంటులోనూ భారత్ కప్ ను తిరిగి సాధిస్తుంది. ఇక్కడ ఆటతీరుతో పాటు మెరుగైన ప్రదర్శన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం సెంటిమెంట్ కు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే మళ్లీ ధోణి నేతృత్వంలోని టీమిండియా కప్ ను సాధిస్తుందని గంటా పథంగా చెప్పుకోవచ్చు.
గత ప్రపంచ కప్ కు ముందు జులై మాసం 4 తేదీన ఒంటిరివాడైన ధోణి.. ఓ ఇంటివాడయ్యాడు. ఆ తరువాత ఏడు మాసాలకు వచ్చిన ప్రపంచ కప్ లో ధోణి నేతృత్వంలోని టీమిండియా కప్ ను నిలబెట్టుకుని 28 ఏళ్ల తరువాత ప్రపంచ ఛాంపియన్లుగా కీర్తిని గడించింది. అయితే ఈ దఫా కూడా టీమిండియా కెప్టెన్ ధోణి జీవితంలో జరగనున్న మరో శుభకరమైన పరిణామం టీమిండియాకు కూడా శుభం చేస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ సారి ఫిబ్రవరిలో జరగనున్న ప్రపంచ కప్ సమయంలోనే ధోణి వ్యక్తిగత జీవితంలోనూ మరో మైలురాయిని అధిగమించనున్నారు. అంటే ఆయన తండ్రి కాబోతున్నారని అర్థం. ఆయనకు సంతానం కలగబోతోంది. దీంతో టీమిండియాకు కూడా శుభకరమైన పరిణామాలు అందనున్నాయని అభిమానులు గెస్ చేస్తున్నారు. టీమిండియా మరో సారి ప్రపంచ కప్ పోటీలో భారత్ ప్రత్యర్థి జట్లను చేధించి సాధిస్తుందని అభిమానులు చెబుతున్నారు.
2010లో సాక్షి ని వివాహమాడిన దోణి నాలుగేళ్ల తరువాత తండ్రి కాబోతున్నారు. అయితే ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్ మార్చి 29 వరకు కొనసాగనున్ననేపథ్యంలో అస్ట్రేలియాలో వున్న ధోణి తన సతీమణి ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని సమాచారం. ఐపీఎల్ స్కామ్ లో ఆరోఫణలు, విమర్శలను ఎదుర్కోంటున్న ధోణికి సంతానం మేలు చేస్తుందని ఆయన అభిమానులు అశిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more