Maxwell helps australia win odi tri series

Australia win ODI tri-series, tri series in australia 2015, australia, England, India, Maxwell helps Australia win, All-rounder Maxwell, Maxwell score, Maxwell wickets, Maxwell allround performance, Maxwell photos, Maxwell achivements, Maxwell latest updates, Maxwell latest news, australia criclet latest updates,

All-rounder hits 95 and takes four wickets as the hosts demolish England by 112 runs in the final.

అస్ట్రేలియా వశమైన ముక్కోణపు వన్డే సీరీస్..

Posted: 02/01/2015 07:08 PM IST
Maxwell helps australia win odi tri series

సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో ఆది నుంచి అధిపత్యాన్ని కనబర్చిన ఆస్ట్రేలియా కైవశం చేసుకుంది. అసీస్ ఆటగాడు మాక్స్ వెల్ అన్ని విభాగాల్లో కనబర్చిన అత్యుత్తమ ప్రతిభతో అసీస్ సునాయాసంగా ముక్కోణపు కప్ ను సొంతం చేసుకుంది. ఇవాళ (ఆదివారం) ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 112 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 278 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ లక్ష్యచేధనలో చతికిల పడింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో.. 20 ఓవర్లకు 5 విక్కెట్లను నష్టపోయి 77 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ను టెయిల్ ఎండర్లు శ్రమకోర్చినా ఫలితం లేకుండా పోయింది.

బొపారా మినహా ఇతర ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎవ్వరూ మూడు పదుల వ్యక్తిగత స్కోరును దాటలేదు. దీంతో మొత్తానికి 39.1 ఓవర్లో 166 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బొపారా(33),మొయిన్ ఆలీ(26),రూట్(25), బ్రాడ్(24) పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్ వెల్ నాలుగు, జాన్సన్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. అల్ రౌండ్ ప్రతిభ కనబర్చిన అసీస్ ఆటగాడు మాక్స్ వెల్ 95 పరుగులను సాధించడంతో పాటు బౌలింగ్ చేసి నాలుగు ప్రధాన విక్కెట్లను కుప్పకూల్చాడు. దీంతో అసీస్ ముక్కోణపు సీరిస్ సొంతం చేసుకోవడానికి కీలకమైన పాత్రను పోషించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia tri-series  Aussies win  India  England  Australia  

Other Articles