India has only 25 percent of chances says kapil dev

india has 25 percent of chances says Kapil Dev, india defending champions of world cup, kapil dev on kohli kisses, kapil sarcastic dig on kohli, India, Virat Kohli, World Cup 2015, kapil dev, Cricket, World Cup Squad, World Cup Points Table, World Cup Schedule, icc cricket world cup 2015, world cup latest news, latest cricket updates, latest Cricket news , latest updated Score

Former India captain Kapil Dev feels that he is fine with Virat Kohli's antics as long as he is performing on field.

వరల్డ్ కప్ లో టీమిండియాకు 25 శాతం అవకాశాలు

Posted: 02/03/2015 10:46 AM IST
India has only 25 percent of chances says kapil dev

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ నుంచి తన ప్రియురాలికి గాల్లో ముద్దులు ఇవ్వడంపై భారత్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. కోహ్లీ ముద్దులు విసరడంపై తనకెలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. అయితే భారీగా స్కోర్లు సాధించినప్పుడు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలని అన్నారు. విరాట్ కోహ్లి సెంచరీ చేసి ప్రియురాలికి గాల్లో ముద్దు విసిరితే తనకేం అభ్యంతరం లేదని, కానీ జీరో పరుగులు చేసి గాల్లో ముద్దులు పెడితేనే ఇబ్బందంటూ సైటర్ విసిరారు. తాము క్రికెట్ ఆడినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పడున్న పరిస్థితులు వేరని ఆయన అంగీకరించారు.

టెస్టు క్రికెట్ నుంచి మేటైన క్రీడాకారుల ఎంపిక జరిగిన క్రమం తమదని అలానే తాము ఎదిగామని, అయితే ఇప్పుటి తరం మాత్రం టెస్టు కన్నా పరిమిత ఓవర్ల క్రికెట్ కే అధిక ప్రాధాన్యమిస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్లెడ్జింగ్ సహా కొన్ని వికృతాలు, వేధింపులు కూడా ఆటలో భాగంగా మారిపోయాయని చెప్పారు. 20 ఓవర్ల పరిమిత మ్యాచ్ టీ 20 లు కూడా అమోదించపడిన ఫార్మెట్ గేమ్ లా మారిందన్నారు. ఇక ఆటగాళ్లు గౌండ్ లోపలికి వచ్చిన తరువాత అందరూ ఆలింగనం చేసుకుంటూ కనబడటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 25 శాతం మత్రమే ఉన్నాయని కపిల్ చెప్పారు. సెమీ ఫైనల్ కు చేరుకునే ప్రతి జట్టుకు కేవలం 25 శాతం అవకాశాలు మాత్రమే వుంటాయని, ఆ తరువాతే అక్కడి నుంచి మ్యాచ్, మ్యాచ్ లో విన్నింగ్ శాతాలు పెరుగుతాయని కపిల్ అబిప్రాయపడ్డారు. ఏ మ్యాచ్ అయినా ప్రారంభం చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పకోచ్చారు. తొలి 15 ఓవర్లలో విక్కట్లు నష్టపోకుండా 40 నుంచి 50 పరుగుతు సాధిస్తే.. సునాయాసంగా 270 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థుల ముందు పెట్టవచ్చనన్నారు. అయితే విక్కెట్ కొల్పోతే మాత్రం ఫలితాలు ఇందుకు భిన్నంగా వుంటాయని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  cricket  Virat Kohli  World Cup 2015  kapil dev  

Other Articles