ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న 11వ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచకప్ లో డిపెండింగ్ చాంపియన్ భారత్ రెండో ర్యాంకుతో బరిలోకి దిగనుంది. అయితే రెండో సంఖ్యతో బరిలోకి దిగనున్నా టీమిండియా బ్యాట్స్ మెన్ ప్రపంచ కప్ లో టాపులేపుతారా..? ప్రపంచ కప్ ను తిరిగి నిలబెట్టుకుంటారా..? అన్న ఉత్కంత అందరిలోనూ వుంది. ఎందుకంటే ఇదే ర్యాంకుతో 10వ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచకప్ బరిలో దిగిన టీమిండియా.. అనూహ్యంగా క్రికెట్ లో విశ్వవిజేతగా నిలిచింది. తాజాగా ప్రపంచ కప్ బరిలో దిగుతున్న టీమిండియా మళ్లీ రెండో ర్యాంకుతో కప్ ను నిలబెట్టుకుంటుందని భారత క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు.
కాగా ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు రెండో ర్యాంక్ దక్కింది. ముక్కోణపు సిరీస్ విజేత ఆస్ట్రేలియా అగ్రస్థానం కైవశం చేసుకుంది. దక్షిణాఫ్రికా మూడో ర్యాంకులో ఉంది. బ్యాటింగ్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా డీవిలియర్స్, హషిమ్ ఆమ్లా మొదటి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. శిఖర్ ధావన్(7), ధోని(8) టాప్ టెన్ కొనసాగుతున్నారు. భారత్ బౌలర్లు ఎవరూ టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేపోయారు. భువనేశ్వర్ కుమార్(13), రవీంద్ర జడేజా(14) మాత్రమే టాప్-20లో ఉన్నారు.
అటు టెస్టు ర్యాంకింగ్ లో భారత్ 7వ స్థానానికి దిగజారింది. కాగా టీ 20లోనూ రెండవ స్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక ప్రధమ స్థానాన్ని అక్రమించుకుంది. ఇక టెస్టు క్రికెట్ లో శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర టాప్ ర్యాంకులో నిలువగా, భారత ఆటగాళ్లు ఎవ్వరూ టాప్ టెన్ ర్యాంకులలోపు చేరుకోలేదు. విరాట్ కోహ్లీ మాత్రం పన్నెండో స్థానాన్ని ఆక్రమించగా, మురళీ విజయ్, చట్టీశ్వర్ పుజారాలు 24, 26 ర్యాంకులలో కొనసాగుతున్నారు. కాగా టీ 20 పరిమిత ఓవర్ల మ్యాచ్ లోనూ టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ సొంతం చేసుకోగా, 8వ స్థానంలో సురేష్ రైనా, 10వ స్థానంలో యువరాజ్ కొనసాగుతున్నారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్
ఆస్ట్రేలియా 52 6254 120
భారత్ (టీమిండియా) 70 8010 114
సౌత్ ఆఫ్రికా 55 6211 113
శ్రీలంక 83 8955 108
ఇంగ్లాండ్ 57 5953 104
న్యూ జేఅలాండ్ 45 4600 102
పాకిస్తాన్ 59 5662 96
వెస్ట్ ఇండీస్ 51 4808 94
బంగ్లాదేశ్ 33 2466 75
జింబాబ్వే 36 1893 53
ఆఫ్గనిస్తాన్ 15 622 41
ఐర్లాండ్ 11 377 34
క్రీకెట్ క్రీడాకారుల వ్యక్తిగత ర్యాంకింగ్స్
1 ఎబి డి విలియర్స్ 891 దక్షిణాఫ్రికా
2 హషీమ్ ఆమ్లా 867 దక్షిణాఫ్రికా
3 విరాట్ కోహ్లీ 831 భారత్
4 కుమార్ సంగక్కర 823 శ్రీలంక
5 తిలకరత్నే దిల్షాన్ 785 శ్రీలంక
6 కేన్ విలియమ్సన్ 757 ఆస్ట్రేలియా
7 శిఖర్ ధావన్ 725 భారత్
8 ధోనీ 721 భారత్
9 క్వింటన్ డి కాక్ 720 దక్షిణాఫ్రికా
10 జార్జ్ బైలీ 717 ఆస్ట్రేలియా
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more