విధ్వంసక బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఆల్ రౌండ్ ఫర్మామెన్స్ తో రాణించడంతో బింబాబ్వే విజయపుటంచులకు చేరడంలో తడబడింది. గేల్ డబుల్ సెంచరీ.. శామ్యూల్స్ సెంచరీతో మోతెక్కించడంతో ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదించలేకపోయింది. ప్రత్యర్థి భారీ స్కొరు చేధించడంలో మాత్రం బింబాబ్వే విరోచితంగానే పోరాడింది. కాగా 44.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది.
జింబాబ్వే ఆటగాళ్లలో విలియమ్స్ కాసేపు పోరాటం చేసినా ఓటమిని తప్పించలేకపోయాడు. 61 బంతుల్లో 9 ఫోర్లతో 76 పరుగుచేసిన విలియమ్స్ ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అవుటయ్యాడు. ఇర్విన్ అర్థసెంచరీ(52) సాధించాడు. ఓపెనర్ రజా 26, టెయిలర్ 37, కెప్టెన్ చిగుంబుర 21 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, టెయిలర్ చెరో మూడు వికెట్లు తీయగా డబుల్ సెంచరీ వీరుడు క్రిస్ గేల్ బౌలింగ్ లోనూ మాయాజాలం చేశాడు. 6 ఓవర్లు వేసిన గేల్.. 35 పరుగులిచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. శామ్యూల్స్ కు ఒక వికెట్ దక్కింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శననిచ్చిన క్రిస్ గేల్ నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు రెండో ఓవర్లోనే ఓపెనర్ స్మిత్ వికెట్ ను కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో క్రిస్ గేల్, శామ్యూల్స్.. వికెట్ ను కాపాడుకుంటూ నిలకడగా ఆడారు. ఇన్నింగ్స్ చివరి పది ఓవర్లలో వరుస సిక్స్ లు, ఫోర్ లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ప్రపంచ రికార్డు భాగస్వామ్యం (372 పరుగులు) నెలకొల్పారు. వన్ డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించడంతోపాటు, వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా గేల్ చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు (16) సాధించి రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స సరసన నిలిచాడు.
రెండో ఇన్నింగ్స్ లో వర్షం కారణంగా కాసేపు ఆట నిలిచిపోయింది. దీంతో డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం జింబాబ్వే 363 (48 ఓవర్లు)గా నిర్ణయించారు. అయితే, 289 పరుగులకే ఆలౌట్ కావడంతో 73 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలిచినట్లయింది. కాగా రోహిత్ శర్మ సాధించిన 264 పరుగులే తనకు స్ఫూర్తిని కల్పించాయని క్రిస్ గేల్ అన్నాడు. అటు బౌలింగ్ లోనూ రాణించి రెండు విక్కెట్లను పటగొట్టాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more