ప్రపంచకప్‌లో అతిథ్య జట్టు న్యూజిలాండ్ జోరు కోనసాగించింది. కివీస్ ఖాతాలో మరో విజయం చేరింది. ఈ విజయంతో పూల్ ఏలో 10 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 23వ రోజున నేపియర్ మైదానంలో గ్రూప్ ఏలో ఆదివారం జరిగిన పోరులో పసికూన అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో కివీస్ ఆరు విక్కెట్లతో అలవోక విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. నిర్ధేశించిన 187 పరుగలు విజయ లక్ష్యాన్ని న్యూజీలాండ్ నాలుగు విక్కట్లను కోల్పోయి సులభంగా చేధించింది.
నిర్ణీత ఓవర్లలో మరో 13.5 ఓవర్లు మిగిలి వుండగానే లక్ష్యాన్ని సాధించి విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్(42; 6 ఫోర్లు, సిక్సర్) మరోసారి చెలరేగాడు. గప్టిల్(57), విలియమ్సన్(33) రాణించారు. ఇలియట్(19) రనౌటయ్యాడు. రాస్ టేలర్(24), ఆండర్సన్(7) నాటౌట్ గా నిలిచారు. ముందుగా బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్తాన్ 47.4 ఓవర్లలో186 పరుగులకు ఆలౌటైంది. నజీబుల్లా జద్రాన్(56), షెన్వారీ(54) అర్థసెంచరీలు చేశారు. అఫ్ఘనిస్థాన్ బౌలర్లలో షాపూర్ బద్రాన్, మహ్మద్ నబి చెరో వికెట్ లభించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్థాన్.. న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు 47.4 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. షెన్వారీ, నజీబుల్లాజద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు జావెద్ అహ్మది, ఉస్మాన్ గని మోకరిళ్లారు. దీంతో మంగళ్ కొద్దిసేపు ధీటుగానే ఎదుర్కోన్నా కేవలం 27 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. దీంతో క్రీజ్ లోకి వచ్చిన షెన్వారీ ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 54 పరుగులతో రాణించగా, ఆ తరువాత వచ్చిన నజీబుల్లా జద్రాన్ రెండు సిక్స్ లు ఎనమిది ఫోర్లతో 56 పరుగులతో రాణించాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన హమిద్ హసన్ నాలుగు ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. వీరి మినహా ఎవ్వరూ డబుల్ డిజిట్ స్కోరును సాధించలేకపోయారు. కివీస్ బౌలర్లలో వెటోరి 4, బౌల్ట్ 3, అండర్సన్ 2, మిల్నేకు 1 విక్కెట్ లభించింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more