క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా విజయాన్ని నమోదు చేసుకుని క్వార్టర్ ఫైనల్స్ లో స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీలంకపై కంగారులు 64 పరుగులతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. 377 పరుగుల లక్ష్య చేధనలో శ్రీలంక టాఫ్ ఆర్డర్ ధీటుగా ఎదుర్కోన్నా.. మిడిల్ ఆర్డర్ తడబాటు.. టెల్ ఎండర్స్ కుప్పకూలడంతో లంక 312 పరుగులకు తొమ్మిది వికెట్లను నష్టపోయింది. చివర్లో లంక బ్యాట్స్ మెన్ చండిమాల్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. గెలుపు కోసం ఒంటరిపోరాటం చేసిన సంగక్కర్ సెంచరీ వృధా అయ్యింది.
అసీస్ భారీ లక్ష్యం భారీ లక్ష్యచేధనకు బరిలోకి దిగిన లంక ఆదిలోనే వికెట్ కోల్పోయింది. లహీరు తిరుమణ్ణే ఐదు బంతులు ఎదుర్కోని 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఈ తరుణంలో ఓపెనర్ దిల్షాన్ తో జతకట్టిన సంగక్కర.. ధీటుగా ఆడారు. 104 వ్యక్తిగత స్కోరు వద్ద సంగక్కర్ ఔటయ్యాడు. ఆ తరువాత మాధ్యూవ్స్ దినేష్ చండిమల్ స్కోరుబోర్డును పరిగెత్తించారు. మాధ్యూవ్స్ 35 పరుగలకు, చండీమల్ 52 పరుగులు సాధించారు. అయినా చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన అసీస్ లంకపై గెలుపును సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగులకే వార్నర్ వికెట్‌ను, 41 పరుగుల వద్ద ఫించ్ వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్, క్లార్క్‌లు మరో వికెట్ పడకుండా ఆదుకున్నారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీలను సాధించారు. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లార్క్... మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 177 పరుగుల వద్ద స్మిత్(72) వికెట్‌ను కూడా ఆసీస్ కోల్పోయింది.
ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన మాక్స్వెల్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేసి తాజా ప్రపంచకప్‌లో రెండో వేగవంతమైన శతకం రికార్డును తన పేరున రాసుకున్నాడు. సెంచరీ సాధించిన వెంటనే మాక్స్ వెల్ ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన ఫాల్కునర్ కూడా వెంటెనే పెవీలియన్ ముఖం పట్టాడు. మరోపక్క వాట్సన్ కూడా అర్ధశతకంతో దూకుడు పెంచాడు. 368 పరుగుల వద్ద వాట్సన్(67), 373 పరుగుల వద్ద హడిన్(25), స్టార్క్(0) లు ఔటవ్వగా, దోహర్తి 0(1), జాన్సన్3(3) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. లంక బౌలర్లలో మలింగ, పెరీరా చెరో రెండు వికెట్లు తీయగా, మాథ్యూస్, ప్రసన్న, దిల్షాన్ తలో వికెట్ తీశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more