Misbah says pakistan wouldnt mind facing india again

India versus pakistan, India vs pakistan, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, India CWC 2015, Live Scores, Live Updates, Pakistan, Pakistan CWC 2015, Sports, World Cup Live, misbah ul haq

misbah says pakistan wouldnt mind facing india again

సెమీస్ లో తలపడితే.. ధీటైన బదులిస్తాం..

Posted: 03/18/2015 10:56 PM IST
Misbah says pakistan wouldnt mind facing india again

వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మరోమారు టీమిండియాతో తలపడే అవకాశం లభిస్తే వారికి దీటుగా బదులిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా సాగనుంది. కాగా అస్ట్రేలియాతో జరిగే మూడవ క్వార్టర్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ గెలిచిన పక్షంలో దాయాధి దేశాల మధ్య మరోమారు రసవత్తర సెమీ ఫైనల్ పోరు సాగనుంది. ఒకవేళ టీమిండియా-పాకిస్థాన్ లు  సెమీ ఫైనల్లో తలపడితే మాత్రం ఈసారి కచ్చితమైన జవాబిస్తామన్నాడు.  లీగ్ పోరులో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకోమని మిస్బాబుల్ తెలిపాడు. ఇదిలా ఉంగా టీమిండియా వరుస విజయాలపై మిస్బా తనదైన శైలిలో స్పందించాడు.
 
గత కొంతకాలంగా టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటమే ఆ జట్టుకు లాభించిందని మిస్బా అన్నాడు. ఈ టోర్నమెంట్ లో టీమిండియా అంచనాలను మించి రాణిస్తోందని అందుకు ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విజయవంతమైన సారథ్యమే కారణమని తెలిపాడు. కాగా, తమ ప్రజలు మరోసారి వరల్డ్ కప్ ను తీసుకురావాలని ఆశిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తమ జట్టుపై చాలా అంచనాలు ఉన్నాయని వాటిని నిజం చేసుకునేందుకు పోరాడతామని మిస్బా అన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  Pakistan  

Other Articles