ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మెల్ బోర్న వేదికగా జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై జరుగుతున్న మ్యాచ్ లో ఆద్యంతం టీమిండియా ఫేవరేట్ గా సాగింది. ప్రపంచ కప్ లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసుకుని సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. సెమీస్ లో మూడవ క్వార్టర్ ఫైనల్ లో తలపడే అసీస్, పాకిస్థాన్ జట్టలో గెలుపోందే జట్టుతో భారత్ తలపడనుంది. బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో 109 పరుగుల భారీ విజయాన్ని ధోణి సేన నమోదు చేసుకుంది.
భారత్ తో మ్యాచ్ లో ఏ దశలోనూ బంగ్లా పోటీ ఇవ్వలేకపోయింది. తమీమ్ , సౌమ్య సర్కార్, మహ్మదుల్లా షకీబ్ ల నుంచి మంచి ప్రారంభాలు ఇచ్చినా.. పెద్ద స్కోరుగా సాధించడంలో విఫలమయ్యారు. టీమిండియా నిర్ధేశించిన 303 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 45 ఓవర్లలలో 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆదిలోనే రెండు విక్కట్లను కొల్పోయి కష్టాలలో పడిన బంగ్లా ఆ తరువాత నిలదోక్కుకుంది అనుకున్న ప్రతీసారి వికెట్లను కోల్పోయింది. పాతిక ఓవర్లలోపు నాలుగు విక్కట్లను నష్టపోయింది. ఆ తరువాత మరో రెండు వికెట్లను, 40 ఓవర్లకు ఆరు వికెట్లు.. 45 ఓవర్లకు అలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 31 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పొందగా, షమీ 37 పుగులిచ్చి రెండు విక్కట్లు, జెడేజా 42 పరుగుల్చి రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ధోణి సేన నిర్ణీత యాభై ఓవర్లలో 302 పరుగులు సాధించింది. తొలి ముఫై ఓవర్లలో తడబాటుకు గురైన ధోణిసేన ఆ తరువాత చివరి ఓవర్లలో కోలుకుని బంగ్లాదేశ్ బౌలర్లు ఉతికి ఆరేసింది. ముఖ్యంగా టీమిండియా స్కోరు బోర్డును రోహిత్ శర్మ, సురేష్ రైనాలు పరుగులు పెట్టించారు. 35 ఓవర్లు ధాటిన తరువాత ధాటిగా అఢిన రోహిత్ శర్మ, సురేష్ రైనాలు స్కోరుబోర్డును పరగులు పెట్టించి నాలుగో విక్కెట్ కు వంద పరుగుల ఫార్టనర్ షిప్ నమోదు చేశారు. పూర్తి లైన్ అండ్ లెన్త్ లో వస్తున్న బందులను కూడా వీరిద్దరూ బౌండరీలకు తరలించారు. 126 బంతులను ఎదుర్కోన్న రోహిత్ ధాటిగా ఆడి.. 14 ఫోర్లు, మూడు సిక్స్ ల సాయంతో 137 పరుగులు సాధించాడు. అటు సురేష్ రైనా కూడా బంగ్లా బౌలర్లను చితకబాదాడు. 57 బంతులను ఎదుర్కోన్న రైనా.. 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 65 పరుగులను సాధించాడు. చివరి పది ఓవర్లలో భారత్ 97 పరుగులు సాధించింది. 15 ఓవర్లలో 150 పరుగులను సాధించింది.
ఓపెనర్ శిఖార్ ధావన్ 30 పరుగులు చేసి 16.3 ఓవర్లో 30 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలీయన్ చేరాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో క్రీజ్ లోకి వచ్చిన అజ్యింక రహానే అచితూడి ఆడుతూ రోహిత్ శర్మతో కలసి నెమ్మదిగా స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యి వెనుదిరిగడంతో క్రీజ్ లోకి వచ్చిన సురేష్ రైనా ధాటిగా ఆడుతూ బంగ్లా బౌలర్లను కంగారు పెట్టించాడు. చివరిలో వచ్చిన జేడాజా కూడా ధాటిగా ఆడి కేవలం 8 బంతులలోనే ఒక్క పోరు సాయంతో 21 పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 302 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ మూడు విక్కెట్లను చేజిక్కించుకోగా, మొర్తాజా, రుబెల్, షకీబ్ తలో వికెట్ సాధించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more