Glenn maxwell challenging india in semi finals match

glenn maxwell news, glenn maxwell all rounder, glenn maxwell career, india vs australia, australia vs india match, icc world cup 2015, india worldcup 2015, australia worldcup 2015, michael clark news

glenn maxwell challenging india in semi finals match : Australia all rounder glenn maxwell challenging that he will bowl well in the semi finals match against india.

టీమిండియాను ‘కంగారె’త్తిస్తానంటున్న ఆల్ రౌండర్

Posted: 03/23/2015 04:59 PM IST
Glenn maxwell challenging india in semi finals match

ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్ చాంపియన్ భారత్ తో సెమీ ఫైనల్ పోరుకు సిద్ధంగా వున్న విషయం తెలిసిందే! వీరిద్దరి మధ్య జరగనున్న ఈ పోరు.. స్పిన్ కు అనుకూలమైన సిడ్నీ వేదిక కానుంది. అంటే.. భారత జట్టుకు ఇది ప్లస్ పాయింట్! ఎందుకంటే.. టీమిండియాలో ఎంటితి ప్రత్యర్థినైనా బోల్తా కొట్టించే స్పిన్ అస్త్రాలు బోలెడున్నాయి. కానీ.. ఆసీస్ మాత్రం కేవలం స్పీడ్ బౌలింగ్ పేనే ఆధారపడి వుంది. షేన్ వార్న్ వెళ్లిపోయిన తర్వాత ఆ జట్టుకు ప్రధాన స్పిన్ బౌలర్ ఎవరూ దొరకలేదు. అయితే.. ఇప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తున్నాడు ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్!

చూడ్డానికి బక్కపలుచగా వుండే ఈ కంగారు క్రికెటర్.. తన బ్యాటును ప్రత్యర్థులపై ఝుళిపించడంతోపాటు తన స్పెల్ తోనూ ముచ్చెమటలు పట్టిస్తాడు. తాను బౌలింగ్ విభాగంలో బాగా రాణించగలనని మ్యాక్స్ వెల్ జట్టు కెప్టెన్ క్కార్క్ కు సందేశాలు పంపాడు. ఈ నేపథ్యంలోనే అతగాడు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నేను వరల్డ్ కప్ లో నా బౌలింగ్ తో 2 వికెట్లు తీశాను. కెప్టెన్ బంతి ఇచ్చిన ప్రతీసారి సద్వినియోగం చేసుకున్నాను. సిడ్నీలో కూడా క్లార్క్ అవకాశమిస్తే.. ప్రత్యర్థి (ఇండియా) జట్టు పరుగులను కట్టడి చేయడమే కాక, కీలక వికెట్లు తీయగలను’ అంటూ అతగాడు చెబుతన్నాడు. మరి.. ఇతను ఏ విధంగా విజృంభిస్తాడో వేచి చూద్దాం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : glenn maxwell  india vs australia  world cup 2015  

Other Articles