bret lee warned the australian teams for tems indias bowlers

Bret lee australia india

bret lee, indain team, australia, world cup, semis, umesh yadav, mahamad shami, mohith sharma

bret lee warned the australian teams for tems indias bowlers. ex fast bowler bret lee warned the australia for the indain team bowaling in this world cup. umesh yadav, mahamad shami, mohith sharma performing excellent in this season.

టీమిండియా బౌలింగ్ తో ఆసీస్ కు ముప్పే: బ్రెట్ లీ

Posted: 03/24/2015 06:34 PM IST
Bret lee australia india

నిన్నటి దాకా టీమిండియాకు బలం కేవలం బ్యాటింగ్ మాత్రమే.. బ్యాటింగ్ లొ అంతలా అదరగొట్టినా బాలింగ్ లో మాత్రం ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది. కానీ అది ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి మారింది ఎంతలా అంటే ఇప్పుడు బారత్ ప్రపంచ కప్ లో ఆడిన అన్నీ మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసి రికార్డులను తిరిగరాస్తోంది. అంతలా భారత బౌలర్లు టీమిండియాలో రెచ్చిపోయి ఫర్ఫామెన్స్ చేస్తున్నారు. టీమిండియా అంటే బ్యాటింగ్ మాత్రమే అనుకునే వారు కూడా బౌలింగ్ గురించి ఆరా తీసేలా తయారయింది టీమిండియా.  

అయితే ఇప్పుడు టీమిండియా విషయంలో ఇదే బలంగా ఉందని హెచ్చరిస్తున్నాడు మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. గతంలో లాగా టీమిండియా బౌలర్లు పేలవంగా లేరని, పేసర్లు ఎంతో రాణిస్తున్నారని వెల్లడించారు. టీమిండియా పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మలు బౌలింగ్ లో బాగా రాణిస్తుండంతో టీమిండియా విజయంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ  ఆసీస్ తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో  టీమిండియాకు బాగా కలిసి వస్తుందని, అది టీమిండియా గెలుపుకు ఎంతో కీలకంగా వ్యహరిస్తుందని బ్రెట్ లీ అంటున్నాడు.
 
టీమిండియా పేస్ బాలర్లతో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలని బ్రెట్ లీ హెచ్చరించారు.  ఇప్పటివరకూ వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో టీమిండియా 70 వికెట్లు తీస్తే 42 వికెట్లు ఫాస్ట్ బౌలింగ్ ఖాతాలో పడిన విషయాన్ని  బ్రెట్ లీ ప్రస్తావిస్తున్నారు.  వారు 145 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం టీమిండియాకు కలిసొచ్చే అంశంగా తెలిపాడు. ప్రస్తుతం టీమిండియా అటు బ్యాటింగ్, బౌలింగ్ లో చాలా బలంగా ఉందని అన్నాడు. మొత్తానికి టీమిండియా బౌలింగ్ పట్ల ఆసీస్ ను హెచ్చరించారు బ్రెట్ లీ.  మరి టీమిండియా బ్రెట్ లీ మాటలను నిజం చేస్తూ, ఆసిస్ ను మట్టి కరిపిస్తుందో లేక ఇంటి బాట పడుతుందో 26 వ తేది కానీ తెలియదు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bret lee  indain team  australia  world cup  semis  umesh yadav  mahamad shami  mohith sharma  

Other Articles