ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో దిగ్విజయ యాత్ర చేసిన ధోణి సేన.. సిడ్నీ వేదికగా అతిధ్య జట్టు అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ కప్ టోర్నమెంటులో ఢిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన సముద్రమంతా ఈదుకుని వచ్చి.. తీరం దగ్గర్లో మునిగి చనిపోయినట్టు.. లీగ్ దశ నుంచి ఓటమి ఎరుగని జట్టుగా వరుస విజయాలను నమోదు చేసుకుని.. చివరాఖరున సెమీ ఫైనల్స్ ముందు బోక్కబోర్లాపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 329 పరుగులు విజయలక్ష్యాన్ని ధోణి సేన ముందు పెట్టింది. భారీ విజయలక్ష్యాన్ని చేధించడంలో అసీస్ ముంగిట ధోణి సేన మోకరిల్లింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రహానే, కెప్టెన్ ధోణి మినహా మిగతా ఆటగాళ్లెవ్వరూ రాణించలేదు.
యువరాజ్ లేని లోటును తాను భర్తీ చేస్తానని తనకు తానే తొడగొట్టుకున్న సురేష్ రైనా, మాటలే తప్ప.. చేతల్లో కాదని తేలిపోయింది. ఓపెనర్లు అందించిన 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకుని నిలదొక్కుకునేందుకు టాప్ అర్ఢర్ మిడిల్ అర్డర్ బ్యాల్స్ మెన్లలో ఎవరూ సాహసించలేకపోయారు. క్రమంగా వికెట్లను కోల్పోతూ వచ్చిన టీమిండియా ఎట్టకెలకు ధోణి అర్ధ సెంచరీతో రాణించడంతో 95 పరుగులతో ఓటమిని చవిచూసింది, లేని పక్షంలో మరెంత ఘోర ఓటమిని చవిచూసి వుండేదో. ఇదివరకు ప్రపంచ కప్ లో అన్ని జట్లను అటౌట్ చేశామని గర్వంగా చెప్పుకున్న భారత్.. అసీస్ చేతిలో మరో మూడు ఓవర్ల ఒక బంతి మిగిలి వుండగానే అలౌట్ అయ్యింది.
ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు ధావన్, రోహిత్ 76 పరుగుల శుభారంభం అందించారు. ధావన్ ధాటిగా ఆడాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 45 పరుగులు చేసి తొలి వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోహ్లి(1) వెంటనే అవుటయ్యాడు. కొద్ది సేపటికే రోహిత్(34), రైనా(7) అవుటవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో రహానే, ధోని జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 178 పరుగుల వద్ద రహానే(44) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ధోని అర్ధసెంచరీ ఒంటరి పోరాటం చేసినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ధోని 65 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేసి రనౌటయ్యాడు. అంతకుముందు జడేజా(16) రనౌటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్కనర్ 3 జాన్సన్ 2, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ను స్మిత్, ఫించ్ నిలబెట్టారు. రెండో వికెట్ కు 182 బంతుల్లో 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 197 స్కోరు వద్ద వీరి భాగస్వామ్యాన్ని ఉమేష్ యాదవ్ విడదీశాడు. సెంచరీ వీరుడు స్మిత్(105) పరుగుల వద్ద అవుట్ చేశాడు. స్మిత్ మొత్తం మ్యాచ్ ను తన వైపు తిప్పుకున్నాడు. పదకొండు ఫోర్లు రెండు సిక్స్ లతో రాణించాడు. అటు మరో ఓపెనర్ ఫించ్ 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఏడు ఫోర్లు, 1 సిక్స్ తో రాణించిన ఫించ్ నిలకడగా అడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. 232 పరుగుల వద్ద విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. 233 పరుగుల వద్ద ఫించ్ అవుటడవడంతో ఒక్క పరుగు తేడాతో ఆసీస్ 2 వికెట్లు చేజార్చకుంది. తర్వాత వరుసగా కెప్టెన్ క్లార్క్(10), ఫాల్కనర్(23), వాట్సన్(28) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా తలపడతాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more