Sachin Tendulkar to coach Indian cricket team

Sachin tendulkar to replace duncan fletcher as team indias coach

Sachin Tendulkar to coach Indian cricket team, Indian cricket team coach Sachin Tendulkar, Indian bating legend Sachin Tendulkar, Indian fans to see Sachin Tendulkar as coach, Indian cricket team coach, team india coach,

Indian bating legend Sachin Tendulkar would like to be seen by the Indian fans as the coach.

ఏప్రిల్ ఒకటి విడుదల.. టీమిండియా కోచ్ గా సచిన్..!

Posted: 04/01/2015 08:26 PM IST
Sachin tendulkar to replace duncan fletcher as team indias coach

ప్రపంచకప్ లో భారత్ సెమీస్ వరకు వెళ్లి ఒత్తిడి తట్టుకోలేక ఇంటికి వెనుదిరడంతో.. టీమ్ మెంబర్లలో ఆత్మవిశ్వాసం నింపే పనిని జట్టు కోచ్ సరిగ్గా నిర్వహించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత టీం కోచ్గా వున్న డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం కూడా ముగుస్తున్న తరుణంలో ఈ స్థానంలో ఎవరు వస్తారోనన్న ఊహగానాలకు తెరబడింది. ఇన్నాళ్లు భారత క్రికెట్ చరిత్రను సువర్ణాక్షరాలతో ప్రపంచ శిలాఫలకంపై తొలి స్థానంలో లిఖించిన భారత క్రికెట్ లెజెండర్ సచిన్ టెండూల్కర్ ఇక టీం ఇండియాకు మార్గనిర్దేశకాలు చేయనున్నారు. టీం ఇండియాను ముందుండి నడిపే బృహత్తర బాధ్యతను తీసుకోనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ సంఘం బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో నిర్ణయం వెలువరించింది.

సచిన్తో మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై ప్రత్యేకంగా సమావేశం అయిన బీసీసీఐ కార్యనిర్వాహక కమిటీ సచిన్పై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. టీమిండియా కొచ్గా సచిన్ సరైనవారని వారు నిర్ణయం తీసుకున్నారు. సచిన్ను కోచ్గా ఎంపిక చేయడంలో భారత క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారని, ఆయన పేరును తొలుత వారే ప్రతిపాదించారని కూడా తెలిసింది. బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్, టీం డైరెక్టర్ రవిశాస్ర్తిని కూడా సంప్రదించాకే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సచిన్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని, మూడేళ్లు ఈ బాధ్యతల్లో కొనసాగుతారని బీసీసీఐ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

'పలు ఆలోచనలు, సంప్రదింపులు జరిపాక నేను బీసీసీఐ సెక్రటరీ కలిసి వర్కింగ్ కమిటీ ముందు సచిన్ పేరును ఉంచాం. చివరకు ఆ కమిటీ ఆమోదించింది' అని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా తెలిపారు. ఫ్లెచర్కు ఎలాంటి కండిషన్లు, షరతులు, పరిమితులు ఉంటాయో అవన్నీ సచిన్కు ఉంటాయని తెలిపారు. ఇంత వరకు బాగానే వుంది కానీ శీర్షికలో ఏప్రిల్ ఒకటి విడుదల అని ఎందుకు రాశారా..? అనుకుంటున్నారా..? సచిన్ పై వున్న అభిమానంతో అసలు ఆ సందేహమే తలెత్తలేదా..? అయితే ఇప్పుడు విషయానికి వస్తున్నాం. ఇవాళ ఏప్రిల్ ఫూల్స్ డే కాబట్టి.. మా వంతు ప్రయత్నం మేం చేశాం.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  india  bcci  cricket  duncan flecther  coach  

Other Articles