yuvraj singh condemn yograj comments | mahendra singh dhoni | ipl 8

Yuvraj singh clarification yograj singh controversial comments mahendra singh dhoni

yuvraj singh news, yograj singh news, mahendra singh dhoni, yograj singh controversy, dhoni controversy, yuvraj singh twitter, india cricket team, ipl t20 matches, ipl 8 season, ipl matches, indian cricketers

yuvraj singh clarification yograj singh controversial comments mahendra singh Dhoni : Indian Dashing Batsman Yuvraj Singh Condemn his father yograj singh controversial comments on indian cricket captain mahendra singh dhoni.

ధోనీపై తండ్రి చేసిన వ్యాఖ్యలను ఖండించిన యువీ..

Posted: 04/09/2015 01:12 PM IST
Yuvraj singh clarification yograj singh controversial comments mahendra singh dhoni

టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మేన్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ ఇటీవలే ధోనీమీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! ధోనీని ఒక దురహంకారిగా పేర్కొన్న యోగరాజ్.. రావణుడితో పోల్చాడు. అంతేకాదు.. 'ధోనీ చేసిందేమీ లేదు. మీడియా వల్లే ధోనీ క్రికెట్ దేవుడయ్యాడు. మీడియా ధోనీని గొప్పగా చిత్రీకరించింది. ఇందుకు అతను అనర్హుడు' అని యోగ్రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ధోనీపై తండ్రి చేస్తున్న సంచలన వ్యాఖ్యలపై తనయుడు యువరాజ్ ఏ విధంగా స్పందింస్తాడా..? అని అందరూ వేచి చూడసాగారు. ఈ క్రమంలోనే యువీ ఆ విషయంపై స్పందించాడు.

ధోనీని రావణుడితో పోల్చిన తండ్రి వ్యాఖ్యలను యువరాజ్ మరోసారి ట్విట్టర్ ద్వారా ఖండించాడు. 'అటువంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీడియా ద్వారా ఆ అంశం మరింత పెద్దదిగా మారడం కూడా మంచిది కాదు. గతంలో చెప్పినట్లుగానే నేను ధోనీ నాయకత్వంలో ఆడటాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తా' అని యువీ స్పష్టం చేశాడు. అలాగే.. కొన్ని రోజుల క్రితమే తండ్రిగా ప్రమోషన్ పొందిన ధోనీని స్వయంగా కలిసి అభినందనలు తెలిపేందుకు తాను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. దీంతో ఈ విషయం కాస్త చల్లారినట్లుగా కనిపిస్తోంది. మరి.. యువీ చేసిన ట్వీట్లపై యోగరాజ్ ఎలా స్పందిస్తాడోనని ఆసక్తికరంగా మారింది.

ఇదిలావుండగా.. 2011 వరల్డ్ కప్ సందర్భంగా హీరోగా నిలిచిన యువరాజ్ ఈసారి జరిగిన 2015 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే! ఇందుకు కారణం ధోనీయే అంటూ యువీ తండ్రి ప్రతిసారీ అతనిపై విమర్శనాస్త్రాలు చేస్తూ వస్తున్నాడు. అయితే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని యువీ వివరణ ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ -8లో తన సత్తా చాటి జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని యువీ ఆరాటుపడుతున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh twitter  yogran singh controversy  mahendra singh dhoni  

Other Articles