sunrisers hyderabad team won against bangalore royal challengers

Sunrisers hyderabad team won against bangalore royal challengers ipl 8

sunrisers hyderabad, bangalore royal challengers, ipl 8 season, chinnaswamy stadium, chris gayle, david warner, shikhar dhawan, virat kohli, ab de villiers, bangalore cricket team members

sunrisers hyderabad team won against bangalore royal challengers ipl 8 : Hyderabad Sunrisers cricket team beats bangalore royal challengers in Chinnaswamy stadium in ipl 8 season on sunday.

బెంగుళూరును హైదరా‘బాదేసింది’.. ఫస్ట్ టైమ్ వెలిగిన సన్ రైజ్

Posted: 04/14/2015 01:07 PM IST
Sunrisers hyderabad team won against bangalore royal challengers ipl 8

ఐపీఎల్ - 8 సీజన్ నేపథ్యంలో ఆదివారం బెంగుళూరు, హైదరబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ లో భీకరమైన బ్యాట్స్ మెన్లైనా గేల్, కోహ్లి, డివిలియర్స్, స్యామీలు వున్నప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇక 167 లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో వార్నర్, శిఖర్ ధావన్ తప్ప చెప్పుకోదగ్గ బ్యాట్స్ మెన్లు ఎవరూ లేరు. అయితే.. వారిద్దరే సమర్థవంతంగా తమ ప్రతిభను కనబరిచి.. తమ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. ఇంకా రెండు ఓవర్లు మిగిలి వుండగానే హైదరాబాద్ జట్టు విజయ కెరటాలను ఎగురవేసింది.

వివరాల్లోకి వెళ్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు బెంగుళూరును మొదట బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన బెంగుళూరు ఆటగాళ్లు.. మొదటి నుంచి బాదుడు మొదలుపెట్టారు. ఓపెనర్ గేల్ మొదట్లో భీభత్సకరంగా ఆడి.. (16 బంతుల్లో 21; 3 ఫోర్లు; 1 సిక్స్) స్కోరుతో వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ కోహ్లీ (37 బంతుల్లో 41; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) పరుగులు చేసి పవెలియన్ చేరాడు. డి విలియర్స్ సైతం (28 బంతుల్లో 46; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) భీకరమైన ఇన్నింగ్స్ ఆడి వెంటనే పవెలియన్ చేరాడు. నిజానికి వీరు ముగ్గురు కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడుతారని అనుకున్నారు కానీ.. తక్కువ స్కోరుతోనే వెనుదిరగడంతో క్రికెట్ అభిమానులు నిరాశపడ్డారు. ఈ దెబ్బతో బెంగుళూరు 166 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక బౌలింగ్ విభాగంలోకొస్తే.. బౌల్ట్‌కు మూడు, భువనేశ్వర్, రవి బొపారాలకు రెండేసి వికెట్లు దక్కాయి.

ఇక 167 లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్లు ధావన్, వార్నర్.. మొదటి నుంచి పరుగుల వర్షాన్ని కురిపించారు. ముఖ్యంగా వార్నర్ అయితే (27 బంతుల్లో 57; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) స్కోరుతో విధ్వంసాన్ని సృష్టించాడు. ఇతని ధాటికి బెంగుళూరు బౌలర్లకు చెమటలు పట్టేశాయి. అలాగే ధావన్ మొదట్లో కాస్త స్లోగా ఇన్నింగ్స్ ఆడినా.. చివరకు వరకు క్రీజులోనే నిలబడి (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్ ని కొనసాగించాడు. అటు ధావన్‌కు అండగా నిలిచిన కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు. దీంతో ఈ మ్యాచ్‌లో వార్నర్ బృందం 8 వికెట్ల తేడాతో గెలిచింది. హైదరాబాద్ జట్టు 17.2 ఓవర్లలో 2 వికెట్లకు 172 పరుగులు చేసింది. చివరగా వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunrisers hyderabad  bangalore royal challengers  ipl 8 season  

Other Articles