Rajasthan | Mumbai | hitrcik | IPL

Rajasthan royals exciting for get hittrick with the mumbai indians match

rajasthan royals, mumbai indians, IPL-8, hitrick, ahmadabad, rajasthan, mumbai, cricket

Rajasthan royals exciting for get hittrick with the mumbai indians match. In this IPL-8 season the rajasthan royals trying to get hittrick at the match, with mumbai indians at ahmadabad.

హాట్రిక్ పై రాజస్థాన్ రాయల్స్ కన్ను

Posted: 04/14/2015 04:24 PM IST
Rajasthan royals exciting for get hittrick with the mumbai indians match

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే నానుడిని అందరూ వినే ఉంటారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ఇందుకు సరిగ్గా సరిపోతారు. రాజస్థాన్ రాయల్స్ టీం వరుసగా రెండు విజయాలతో దూసుకెళ్లి ఇప్పుడు హైట్రిక్ పై కన్నేసింది. మరోపక్క ముంబై ఇండియన్స్ ఇప్పటికీ బోణీ కొట్టలేదు. దాంతో కనీసం ఈ మ్యాచ్ లో అయినా తమ సత్తా చాటాలని పరువు కోసం ఆరాటపడుతోంది. ఐపీఎల్-8లో నేటి రాత్రి జరగనున్న 9వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడనున్నాయి. ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన బోణి కొట్టలేదు. ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి బోణి కొట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ 'హాట్రిక్' విజయంపై గురి పెట్టింది. వరుసగా మూడో గెలుపు సొంతం చేసుకోవాలని రాయల్స్ ఉవ్విళ్లూరుతోంది.

అహ్మదాబాద్ లో ఇప్పటివరకు జరిగిన 8 ఐపీఎల్ మ్యాచుల్లో ఆరుసార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందింది. ఈ మైదానంలో 150 పరుగులు చేసిన ఏ టీము ఇప్పటివరకు ఓడిపోలేదు. గతేడాది ఇక్కడ ఆడిన మ్యాచ్ లో ముంబై ఓపెనర్లు మైఖేల్ హసి, సిమన్స్ 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గత ఫలితాలను బట్టి చూస్తే రాజస్థాన్ కంటే ముంబై మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 14 సార్లు తలపడగా 9 సార్లు, 5 పర్యాయాలు రాజస్థాన్ విజయం సాధించాయి. అయితే ఈ సీజన్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. రాజస్థాన్ రెండు వరుస విజయాలతో జోరు మీద ఉంది. బలబలాల విషయంలో రెండు జట్టు సమవుజ్జీలుగా ఉన్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajasthan royals  mumbai indians  IPL-8  hitrick  ahmadabad  rajasthan  mumbai  cricket  

Other Articles