BCCI recommends Rohit Sharma for Arjuna Award

Rohit sharma recommended for arjuna award

Rohit Sharma, Ravichandran Ashwin, BCCI working committee meet, double ton, Australia, Srilanka, ODIs, Arjuna award, outstanding achievement in field of sports, Rohit Sharma highest score in a match, Kolkata, BCCI working committee meet, Board of Control for Cricket in India, Indian cricket, cricket news,

In the BCCI's working committee meet on Sunday at Kolkata, the board recommended batsman Rohit Sharma for the prestigious Arjuna Award for the year 2015.

అర్జున అవార్డుకు రోహిత్ శర్మ.. ప్రతిపాదించిన బిసీసీఐ

Posted: 04/26/2015 07:57 PM IST
Rohit sharma recommended for arjuna award

భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకను కనబరుస్తూ ముందుకు సాగుతున్న యువ క్రికెట్ కిశోరం రోహిత్ శర్మ కీర్తీ కిరీటంలో మరో అరుదైన పురస్కారం చేరనుంది. అన్ని కలసి వస్తే.. త్వరలోనే ఆయన క్రీడాకారులకు లభించే అత్యున్నత పురస్కారం లభించనుంది. ఇవాళ కొల్ కత్తాలో భేటీ అయిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు సిఫార్పు చేసింది. గత ఏడాది క్రికెట్ రంగంలో రోహిత్ కనబర్చిన అత్యుత్తమ ప్రతిభ నేపథ్యంలో ఈ మేరకు ఆయన పేరును సిఫార్సు చేసింది.

గతఏడాది 13 నవంబర్ మాసంలో ఈ ముంబాయి క్రికెటర్.. వన్డే క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన పేరును ప్రతిపాదించింది. రోహిత్ అత్యంత ఫేవరట్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంక జట్టుపై రోహిత్ శర్మ అద్భుతమైన 265 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు సంవత్సరంలో 2013లో అదే నవంబర్ మాసంలో మూడో తేదీన అస్ట్రేలియాపై 209 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ ను సరికోత్త శిఖరాలకు తీసుకువెళ్తున్న ఈ 27 యువ క్రికెటర్ అర్జున అవార్డును ఇవ్వాలని బిసిసిఐ ప్రతిపాదించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  BCCI working committee meet  Arjuna award  

Other Articles