Bangalore Ipl Team Won Agaist Delhi in firoz shah kotla stadium | Ipl 8 season

Bangalore royal challengers won ipl match delhi dare devils firoz shah kotla stadium

ipl 8 season, ipl 8 news, ipl 8 matches, bangalore ipl team, bangalore royal challengers, delhi dare devils, delhi dare devils ipl match, firoz shah kotla stadium, virat kohli, chris gayle, jp duminy

bangalore royal challengers won ipl match delhi dare devils firoz shah kotla stadium : Finally Bangalore Ipl team won the match against delhi with extreme performance.

బెంగుళూరు ధాటికి అతలాకుతలమైన ఢిల్లీ

Posted: 04/27/2015 10:01 AM IST
Bangalore royal challengers won ipl match delhi dare devils firoz shah kotla stadium

ఐపీఎల్-8లో భాగంగా ఫిరోష్ షా కోట్ల మైదానం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు మీద బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో బెంగుళూరు బౌలింగ్ ప్రదర్శన అందరినీ ‘ఔరా’ అనేలా అబ్బురపరిచింది. ఇన్నాళ్లూ బౌలింగ్ బలహీనమని బాధపడిన కోహ్లి బృందాన్ని వరుసగా రెండో మ్యాచ్‌లోనూ బౌలర్లే గెలిపించడంతో అందరూ ఆశ్చర్యపోవాల్సిన వంతయ్యింది. ఢిల్లీలో జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నా.. తక్కువ స్కోరుకే బెంగుళూరు బౌలర్లు కట్టడి చేశారు. ఇక లీగ్‌లోనే అత్యంత విలువైన ఆటగాడు యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన ఈ మ్యాచ్‌లోనూ కొనసాగడంతో ఢిల్లీ ఓటమి చవిచూడక తప్పలేదు.

వివరాల్లోకి వెళ్తే.. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగుళూరు.. ఢిల్లీ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ కోసం బరిలోకి దిగిన ఢిల్లీ ఆటగాళ్లు.. మొదటినుంచే పేలవ పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శిస్తూ వచ్చారు. జట్టులో వున్న ధీటైన ఆటగాళ్లు మంచి స్కోరుతో రాణిస్తారని అనుకున్నారు గానీ.. అలా జరగలేదు. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.2 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. కేదార్ జాదవ్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు), మయాంక్ (34 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బెంగుళూరు బౌలర్లలో స్టార్క్ 3, ఆరోన్, వీస్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇక 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గేల్, కోహ్లి ఆరంభం నుంచే బ్యాట్ ఝుళిపించారు. కోహ్లి కంటే ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్న గేల్.. ఓవర్‌కు బౌండరీతో పాటు వీలైనప్పుడల్లా సిక్సర్ బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 50 పరుగులకు చేరింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఓవర్‌కు తొమ్మిదికి పైగా రన్‌రేట్‌ను సాధిస్తూ.. జట్టును గెలిపించారు. దీంతో బెంగళూరు 10.3 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 99 పరుగులు చేసి నెగ్గింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 8 season  bangalore royal challengers  delhi dare devils  

Other Articles