Mumbai Indians won ipl title in the second time | Mumbai Indians

Mumbai indians won ipl title in the second time

Chennai Super Kings, Cricket, CSK, HarbhajanSingh, India, IPL, IPL 8, IPL final, KieronPollard, Lendl Simmons, MI, Mumbai Indians, Rohit Sharma, SachinTendulkar, Sports

Mumbai indians won IPL-8 Mumbai Indians thump Chennai Super Kings to win second IPL title Mumbai Indians' love affair with Eden Gardens contiuned as they clinched their second IPL title following a crushing 41-run win over Chennai Super Kings in a lop-sided summit clash.

రెండోసారి ఐపియల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్

Posted: 05/25/2015 11:47 AM IST
Mumbai indians won ipl title in the second time

టైటిల్ విజేత ఎవరో ఎవరో అని సాగిన ఐపిఎల్-8 సీజన్ ను ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ టైటిల్‌ను ముంబై జట్టు గెలుచుకోవడం ఇది రెండోసారి. 2013లో తొలిసారి ముంబై జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఐపిఎల్-8  ఫైనల్లో ముంబై జట్టు 41 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది.  ఈ ఫైనల్లో ముంబై జట్టు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ దుమ్ము రేపింది. ఆరంభంలోనే తొలి వికెట్‌ కోల్పోయినప్పటికీ కెప్టెన్‌ రోహిత్‌, మరో ఓపెనర్‌ లెండిల్‌ సిమ్మన్స్‌ జట్టుకు అండగా నిలిచి భారీ స్కోరు గట్టి పునాది వేశారు. మరోవైపు చెన్నై జట్టు అన్ని విభాగాల్లో విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా.. తర్వాత చెన్నై జట్టు 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఓపెనర్లు మైకెల్‌ హస్సీ, డ్వైన్‌ స్మిత్‌ ఆరంభం నుంచే భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ముంబై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా సాధ్యప డలేదు.

ఈ సీజన్లో వరసగా తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిన ముంబై తరువాత దూకుడు పెంచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఐ.పి.ఎల్లో రోహిత్ శర్మ టైం నడుస్తోన్నట్టుంది. ఇప్పటికే తన జట్టుకు రెండోసారి ట్రోఫీ అందించాడు. 2013లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. గతేడాది జట్టును ఫ్లే ఆఫ్కు చేర్చాడు. ఇప్పుడు మరోసారి ఛాంపియన్గా నిలిపాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఫైనల్ ఫైట్లో ముంబై ఆల్రౌండ్ షో చూపించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై బ్యాట్స్మెన్ అదుర్స్ అనిపించారు. ఓపెనర్ పార్ధివ్ పటేల్ పరుగుల ఖాతా తెరువకపోయినా.. మరో ఓపెనర్ సిమన్స్.. కెప్టెన్ రోహిత్ దూకుడుగా ఆడారు. స్మిత్ 45 బంతుల్లో 68 రన్స్ చేయగా.. రోహిత్ 26 బంతుల్లోనే 50 రన్స్ చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరికి తోడు చివర్లలో రాయుడు, పొలార్డ్ కూడా మెరుపులు మెరిపించారు. పొలార్డ్ 18 బంతుల్లో 3 సిక్సర్లతో 36 రన్స్ చేయగా.. రాయుడు 24 బంతుల్లోనే 36 రన్స్ చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది.

భారీ లక్ష్య చేధనలో చెన్నై ఆరంభం నుంచి తడబింది. ఓపెనర్ హస్సీ త్వరగా పెవిలియన్కు చేరడం చెన్నైను దెబ్బ తీసింది. తరువాత స్మిత్-రైనా కాసేపు క్రీజ్లో నిలిచినా ముంబైకు బ్రేక్ ఇచ్చాడు భజ్జీ. మొదట 57 రన్స్ చేసిన స్మిత్ను, తరువాత 28 రన్స్ చేసిన రైనాను పెవిలియన్కు పంపాడు. అక్కడ నుంచి చెన్నై వికెట్ల పతనం లాంఛనమైంది. భారీ హోప్స్ పెట్టుకున్న ధోనీ, బ్రావో కూడా ఫెయిలవ్వడంతో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో మెక్లీన్గన్ 3, మలింగా, భజ్జీ చెరో 2 వికెట్లు తీసి.. తన జట్టుకు 41 రన్స్ తేడాతో ఘన విజయం అధించారు. కెప్టెన్ రోహిత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai Super Kings  Mumbai Indians  Rohit Sharma  SachinTendulkar  

Other Articles