ipl8 award winners | mumbai indians | rohit sharma

Ipl8 2015 full list of award winners important statistics

ipl 8 award winners, ipl8 award winners list, ipl8 full statistics, rohit sharma, ipl8 season news

ipl8 2015 Full list of award winners important statistics : The Full List Of IPL-8 2015 Awards and important statistics. Mumbai Indians (MI) were crowned the Indian Premier League 2015 (IPL 8) champions.

ఐపీఎల్-8లో ఏయే అవార్డులు ఎవరికీ దక్కాయంటే..

Posted: 05/25/2015 01:10 PM IST
Ipl8 2015 full list of award winners important statistics

ఐపీఎల్ మ్యాచులు జరిగే ప్రతీ సీజన్ లోనూ ప్రతిభ చాటుకున్న కొందరు ఆటగాళ్లకు ప్రత్యేక అవార్డులు-రివార్డులు అందించడం జరుగుతుంది. ఈసారి ఐపీఎల్-8 సందర్భంగా కూడా ఆ విధంగానే కొందరు ఆటగాళ్లకు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఐపీఎల్-8లో భాగంగా చెన్నై, ముంబైకి మధ్య జరిగిన తుదిపోరులో ముంబై సంచలన విజయం నమోదు చేసిన అనంతరం ప్రజెంటేషన్ వేడుకలో అవార్డులు అందజేశారు. అలాగే.. లక్షల రూపాయల బహుమతులూ ఇచ్చారు.

మొదట విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టుకు రూ.15 కోట్లతోపాటు ట్రోఫీ దక్కింది. అనంతరం రన్నరప్ గా నిలిచిన చెన్నై జట్టుకు రూ.10 కోట్లు లభించాయి. ఇక ఈ మ్యాచ్ లో తన బ్యాట్ ను ప్రతర్థి జట్టుపై ఝుళిపించిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇందుకు అతనికి రూ.5 లక్షల రూపాయలను సమర్పించారు. అనంతరం ఈ లీగ్ లో అద్భుతంగా ప్రదర్శించిన మిగతా ఆటగాళ్లకూ బహుమతులు అందజేవారు. ఆ వివరాలు క్రింది విధంగా వున్నాయి...

* మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - ఆండ్రీ రస్సెల్ (రూ.10 లక్షలు)
* ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అవార్డ్ - ఆండ్రీ రస్సెల్ (19 బంతుల్లో 50 పరుగులు) (రూ.10 లక్షలు)
* క్యాచ్ ఆఫ్ ది సీజన్ - డ్వేన్ బ్రావో (రూ.10 లక్షలు)
* ఎమర్జింగ్ ప్లేయర్ - శ్రేయాస్ అయ్యర్ (రూ.10 లక్షలు)
* అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు - డేవిడ్ వార్నర్ (రూ.10 లక్షలు) (ఆరెంజ్ క్యాప్)
* అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు - డ్వేన్ బ్రావో (రూ.10 లక్షలు) (పర్పుల్ క్యాప్)
* మ్యాక్సిమమ్ సీజన్ సిక్సెస్ అవార్డు - క్రిస్ గేల్ (రూ.10 లక్షలు)
* ఫెయిర్ ప్లే అవార్డు - చెన్నై సూపర్ కింగ్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl8 award winners  mumbai indians  rohit sharma  

Other Articles