Sunil Gavaskar Says Luck Played a Big Part at the Start of his Career

Luck played a big part at the start of my career sunil gavaskar

Sunil Gavaskar, Kapil Dev, Coach, Team India, Cricket, last One-Day-International, Test debut, Gavaskar cricketing career, India, Sunil Manohar Gavaskar, Cricket Sunil Gavaskar Says Luck Played a Big Part at the Start of his Career, latest Cricket news

Sunil Gavaskar said luck played a big part earlier in his cricketing career which spanned over 16 years from making his Test debut in March, 1971 to playing his last ODI in November, 1987.

నా అదృష్టమే నన్ను క్రికెట్ లో నిలిపింది: గవాస్కర్

Posted: 05/30/2015 08:41 PM IST
Luck played a big part at the start of my career sunil gavaskar

తన క్రికెట్ జీవితంలో  అదృష్టం ప్రధాన పాత్ర పోషించిందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తాజాగా స్పష్టం చేశాడు. తాను క్రికెట్ కెరీర్ ను ఆరంభించిన తొలినాళ్లలో అదృష్టమే కాపాడిందని పేర్కొన్నాడు. భారత మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టే జీవితం ఆధారంగా రాస్తున్న 'ఏజ్ లక్ వుడ్ హేవ్ ఇట్' పుస్తకాన్ని ప్రారంభించిన గవాస్కర్..  తన గత స్మృతులను నెమరవేసుకున్నాడు. తాను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది నిజంగా అదృష్టమేనన్నాడు. 1971లో భారత్ చేపట్టిన వెస్టిండీస్ పర్యటనను ఈ సందర్భంగా గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు. ఆ పర్యటన మాత్రం తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందన్నాడు.
 
 అయినా ఇక్కడ ఉన్నానంటే మాత్రం అది అదృష్టంతోనేనని పేర్కొన్నాడు. ఆ సిరీస్ లోని ఒక టెస్ట్ మ్యాచ్ లో తాను కొట్టిన షాట్ కు పరుగు తీస్తుండగా.. వెస్టిండీస్ ఆటగాడు గ్యారీ సోబర్స్ ఫీల్డింగ్ చేస్తూ విసిరిన బంతి తన ఛాతిపై బలంగా తగిలి గ్రౌండ్ లో పడిపోయానన్నాడు. అనంతరం తీవ్రమైన  నొప్పితోనే హాఫ్ సెంచరీ చేశానన్నాడు. 1971 నుంచి 1987 వరకూ 16 సంవత్సరాల పాటు క్రికెట్ జీవితాన్ని అత్యుద్భుతంగా ఆస్వాదించిన గవాస్కర్.. 125టెస్టుల్లో 10,122 పరుగులు చేసి అరుదైన ఘనతను సాధించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Gavaskar  cricket  Kapil Dev  Coach  Team India  

Other Articles