పాకిస్థాన్ లోని లాహోర్ లో మరోమారు ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. పాకిస్థాన్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న రెండవ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటన ఆసల్యంగా వెలుగుచూసింది. శుక్రవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈ రెండు జట్లు రెండో వన్ డే ఇంటర్నేషన్ మ్యాచ్ ఆడాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఉగ్రవాది అక్కడిక్కడే తనను పేల్చుకున్నాడు.
ఈ దాడిలో ఒక ఎస్సై అబ్దుల్ మజీద్ మరణించగా, ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అనుమానం రావడంతో ఎస్ ఐ అబ్దుల్ మజీద్ ఆత్మహుతి సభ్యుడిని. అడ్డుకోగా, అతను అక్కడిక్కడే తనను తాను పేల్చుకోవడంతో.. ఎస్ ఐ సహా మరో సౌరుడు మరణించాడు. సుమారు 20 వేల మంది ప్రేక్షకులు వున్న స్టేడియంలోకి ప్రయత్నించిన ఉద్రవాద అత్మహుతి సభ్యుడిని అడ్డుకుని అమరుడైన ఎస్ ఐ అబ్దుల్ మజీద్ ను స్థానికులు కీర్తిస్తున్నారు. 2009లో సరిగ్గా గఢాఫీ స్టేడియంలో మ్యాచ్ అడేందుకు వెళ్తున్న శ్రీలంక జట్టు సభ్యులపై అప్పట్లో ఉద్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తరువాత గత ఆరేళ్లుగా పాకిస్థాన్ లో ఎలాంటి మ్యాచ్ లు ఆడేందుకు ఏ దేశం కూడా అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో సుమారు ఆరేళ్ల తరువాత పరిస్థులు మారాయని భావించిన జింబాంబ్వే జట్టుకు పాకిస్థాన్ నుంచి పూర్తిస్థాయి భద్రత హామీ కల్పిస్తామన్న భరోసాలతో పర్యటిస్తోంది. పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు సమ్మతిని తెలపడంతో పాటు ఇప్పటికే పలు మ్యాచ్ లను కూడా ఆడింది. ఈ క్రమంలో నిన్న జరిగిన మ్యాచ్ లో మరోమారు ఉగ్రవాదులు ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ సారి కూడా మళ్లీ గఢాఫీ స్టేడియం సమీపంలో ఉగ్రదాడి జరిగింది. విషయం బయటికి వస్తే తమ దేశం పరువు మరింత దిగజారుతుందని భావించిన పాక్ ప్రభుత్వం సంబంధిత వార్తలను ప్రసారం చెయ్యొద్దని బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌ను ఆదేశించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఆత్మహుతి దాడి జరగిన తరువాత కూడా జింబాంబ్వే తన పాకిస్థాన్ పర్యటనను కోనసాగిస్తామని తేల్చిచెప్పింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more